Ammayi garu Serial Today Episode రూప బంటిని దగ్గరకు తీసుకుంటుంది. విరూపాక్షి, సూర్యప్రతాప్‌లు అక్కడే ఉంటారు. అమ్మానాన్నల ప్రేమ నేను పొందలేకపోయాను. నేను పొందలేక పోయిన ప్రేమ నీకు పంచుతా నువ్వు సంతోషంగా పడుకో అని చెప్తుంది. బంటీ రూప అలియాస్ రుక్మిణి దగ్గరే పడుకుంటా అని రూప ఒడిలో పడుకుంటాడు. విరూపాక్షి వాళ్లు చాలా సంతోషిస్తారు. 

విజయాంబిక, దీపక్‌లు అందరూ కలిసి రుక్మిణికి రూప స్థానం ఇచ్చేలా ఉన్నారు ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. ఉదయం  రూప ఇంట్లో అందరికీ పిలిచి హారతి ఇస్తుంది. ఇంతలో విజయాంబిక వచ్చి ఏంటి ఈ అరిష్టం రూప కర్మ కాకుండానే ఇలా పూజలు ఏంటి అని తిడుతుంది.  ఇంతలో సూర్యప్రతాప్‌ వస్తే రూపకి ఇంకా పెద్దకర్మ కాలేదు అప్పుడే పూజలు మొదలు పెట్టేసిందని అంటుంది. రూప అలియాస్ రుక్మిణి తండ్రి దగ్గరకు తీసుకెళ్లి హారతి ఇస్తుంది. వాళ్లు చెప్పేది నిజమే కదా అని సూర్యప్రతాప్‌ అంటారు. తెలిసే తెలీకో తప్పు చేశావ్  అది నా కూతురి ఆత్మకు మంచిది కాదు అని అంటారు. దానికి రుక్మిణి అయ్యో నాయనా అసలు అక్క చనిపోతే కదా ఆత్మ శాంతించడానికి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. 

విజయాంబిక కొడుకుతో నేను చెప్పా కదా ఇదే రూప అని అంటాడు. రుక్మిణి అందరితో అక్క చనిపోలేదు మీ పక్కనే ఉంది మీ చుట్టూ తిరుగుతూ ఉంది అని అంటుంది. దాంతో దీపక్ తను రూప కాదు అని అంటాడు. నా బిడ్డ చనిపోయింది అంటే నమ్మలేకపోతున్నా అలా నమ్మకుండా ఉండలేను అని సూర్యప్రతాప్‌ బాధ పడతాడు. అక్కని దూరం చేసిన దేవుడు నన్ను నీ దగ్గర చేశాడని ఎందుకు అనుకోవడం లేదు నాయనా నేను నీ బిడ్డనే అని అంటుంది. ఏంటి చిన్నాయనా చిన్నమ్మ నన్ను చూస్తే మా అక్కని చూస్తున్నట్లు లేదా అని అడుగుతుంది. తర్వాత రాజుని రైస్ పీస్ అనేస్తుంది. అందరూ షాక్ అవుతారు. తర్వాత రూప కంగారు పడుతుంది.

విజయాంబిక కంగారుగా ఏంటి రైస్ పీసా చూశావా తమ్ముడు రాజుని అలా రూప మాత్రమే అంటుంది. వచ్చిన ఒక్క రోజులోనే ఇంత ఎలా తెలుసుకుంటుంది అని తను రుక్మిణి కాదు ఆ వేషంలో ఉన్న మరో అమ్మాయి అయినా అయింటుంది లేదంటే రూప అయింటుంది అని అంటుంది. దానికి రూప చాలు ఆపు అత్త నేను నా వాళ్లనే పిలిచాను కదా బావ పేరు నూకరాజు అందుకే అలా పిలిచాను అని చెప్తుంది. రాజు పేరు నూకరాజు అని నీకు ఎలా తెలుసు అని దీపక్ అడుగుతాడు. దాంతో బంటి ప్రోగ్రస్ కార్డులో చూశానని చెప్తుంది. మంచి కోసమే పూజ చేస్తారు కదా నేను పూజ చేసేది మంచి కోసమే అని అంటుంది. 

బంటీ వచ్చి అమ్మ స్కూల్‌కి టైం అవుతుంది స్కూల్‌లో డ్రాప్ చేయ్ అంటాడు. బంటి అమ్మ అని పిలిచాడని మళ్లీ అనుమానించొద్దు తన తల్లిలా ఉన్నానని నేను  అలా పిలవమన్నాను అని చెప్తుంది. రూప బాగా కవర్ చేస్తుంది గంట టైం ఇస్తే తను రూప అని లేదంటే రుక్మిణి కాదని తేల్చేతా అని అంటుంది. సూర్యప్రతాప్‌ రూపతో నువ్వు ఎవరో ఒప్పుకో అమ్మా ఇలా ఎవరో ఏదో అనే వరకు వద్దు అంటారు. ఇది సందర్భం కాదు అనుకుంటుంది. అత్త మాదిరి నువ్వు నన్ను అనుమానించొద్దు నాయనా అని అంటుంది. ఇక విజయాంబిక మాత్రం ఒక అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది. అందరూ కూర్చొపెట్టి ఫ్రింగర్ ఫ్రింట్స్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపిస్తుంది. రూప వేలి ముద్రలు ఉన్న డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్న రుక్మిణి వేలి ముద్రలు సరి చేస్తే తనని బయటకు గెంటేస్తారని అంటుంది. 

అత్తయ్య ఏం ప్లాన్ వేస్తుందో అని రూప కంగారు పడుతుంది. విరూపాక్షి ఏం కాదని ధైర్యం చెప్తుంది. వేలి ముద్రలు సరి చూడటానికి వచ్చారని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. దొరికిపోయానని రూప తల్లితో చెప్తుంది. ఏం కంగారు పడొద్దని తల్లి చెప్తుంది. సూర్యప్రతాప్‌ సరే అంటాడు. చంద్ర రూప పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లు తీసుకొస్తాడు. అందులో రూప వేలిముద్రలు రుక్మిణి వేలిముద్రలు సరి చూడాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!