Husband Died While Saving His Wife: రైలు నుంచి కింద పడబోయిన భార్యను కాపాడబోయి ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా (Nandyal District) డోన్ (Done) సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య అసియాబాను ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. ఈ క్రమంలో అసియాబాను నిద్రమత్తలో ఎర్రగుంట్ల వద్ద రైలులో నుంచి కిందపడిపోయింది. దీన్ని గమనించిన ఆసిఫ్ ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు కర్ణాటక ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరు 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని.. గుంటూరు నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Also Read: Andhra Pradesh: కోడిని చంపినందుకు అనకాపల్లిలో కేసు నమోదు