భార్య చికెన్ వండకపోతే ఏం చేస్తారు ? వస్తే వండుకుని తింటారు..లేకపోతే బయటకెళ్లి తిని వస్తారు ! రెండూ చేయలేకపోతే వండింది తిని పడుకుంటారు. కానీ అందరూ ఒకలాగే ఉండరు. కొంత మంది మరీ తేడాగా ఉంటారు. ఎంత తేడా అంటే.. మనసులో పెట్టుకుని కుళ్లి కుళ్లి బాధపడి.. చివరికి ఆత్మహత్య చేసుకునేంత. దుండిగల్‌లో ఇలాంటి విపరీత మనస్కుడు ఒకరు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నందునే ఈ విషయం తెలిసింది.
3 నెలల చిన్నారిని 6 సార్లు అమ్మేశారు! అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు
భార్య చికెన్ వండలేదన్న కోపంతో భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్‌లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన ఆటోడ్రైవర్ రతన్‌లాల్ (32) , రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మూడేళ్ల క్రితం వారు బతుకుదెరువు కోసం దుండిగల్‌కు వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ నెల 25న సాయంత్రం రతన్‌లాల్ మద్యాన్ని ( liqor ) తాగి కోడిమాంసం కొని ఇంటికెళ్లాడు. కోడి కూర ( chicken curry ) వండి పెట్టాలని భార్యకు చెప్పాడు.
కొత్తగూడెంలో శవం మాయం, మిస్టరీగా వ్యవహారం - ఇలా బయటికొచ్చింది
అయితే కుమార్తెకు చికెన్ పాక్స్ ( Chicken Fox ) సోకడంతో చికెన్ కూర వండకూడదని భార్య చెప్పింది. కానీ వినలేదు.వండాల్సిందేనన్నాడు. రతన్ లాల్ భార్య వండడానికి నిరాకరించింది. ఆ తర్వాతి రోజు తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి బయటకు వెళ్లాడు. వచ్చేటప్పుడు యాసిడ్ ( Yasid ) తాగి ఇంటికొచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి ( Hospital ) తరలించారు. యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ చనిపోయాడు.
షాకింగ్ ! సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై పెట్రో బాంబులతో మహిళ దాడి, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
కుమార్తెకు చికెన్ ఫాక్స్ సోకితే.. తగ్గడానికి ఏం చేయాలో ఆలోచించకుండా అదే పనిగా మద్యం తాగుతూ.. చికెన్ కోసం ఏకంగా ప్రాణం తీసుకున్న రతన్ లాల్ వ్యవహారం ఆయన బంధువుల్లోనూ చర్చనీయాంశమయింది. ఇప్పుడు అనాధమారిన ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటని వారు చర్చించుకుంటున్నారు.
50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన!