How The Bride Became A Killer : మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో హనీమూన్‌కు వెళ్లిన జంట అదృశ్యమయింది.కొద్ది రోజులకు ఆ జంటలో భర్త శవం దొరికింది. హత్యకు గురయినట్లుగా తేలింది. మరి ఆ భార్య ఏమయింది?. అసలు ట్విస్ట్ బ యటపడిన తర్వాత తమ ఇంటి కంటి వెలుగులు అని పెళ్లి చేసిన ఆ కుటుంబాలు సిగ్గులతో తలదించుకుంటున్నాయి. రాజా రఘువంశీ ఇండోర్‌లోని సహకార్ నగర్‌లో నివాసం ఉంటున్న ఉన్నత కుటుంబంలోని అందరి కంటే చిన్నవాడు. ముగ్గురు సోదరులలో చిన్నవాడు. అతని ఇద్దరు అన్నలు, సచిన్ , విపిన్ లు పెళ్లి అయినా ఉమ్మడిగానే ఉంటున్నారు. రాజా రఘువంశీ 2007 నుంచి కుటుంబ వ్యాపారమైన "రఘువంశీ ట్రాన్స్‌పోర్ట్" ను నిర్వహిస్తున్నాడు. మంచి కుర్రాడుగా పేరు తెచ్చుకున్న అతనికి గత నెలలో, మే 11న, అతను సోనమ్ తో పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. పన్నెండు రోజుల తర్వాత మేఘాలయ దట్టమైన అడవులలో హత్యకు గురయ్యాడు.
రాజా రఘవంశీ పెళ్లి చేసుకున్న సోనమ్, ఇండోర్‌లోని కుశ్వాహ నగర్‌లో నివసించే ప్లైవుడ్ ఫ్యాక్టరీ యజమాని దేవీ సింగ్ రఘువంశీ కుమార్తె. ఆమె కుటుంబ వ్యాపారంలో బిల్లింగ్, అకౌంట్స్, సూపర్‌విజన్ వంటి దాదాపు అన్ని విభాగాలను చూసుకునేది. రాజ్ కుశ్వాహ అనే వ్యక్తి సోనమ్ తండ్రి ఫ్యాక్టరీలో బిల్లింగ్ విభాగంలో పనికిచేరాడు. ఇప్పుడు రాజ్ రఘువంశీని హత్య చేసింది ఈ రాజ్ కుశ్వాహనే అని తేలింది. సోనమ్, రాజా మధ్య పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. వారి మధ్య ఎలాంటి ముందస్తు పరిచయం లేదు. కానీ పెద్దలు సంబంధం చూసిన తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. వివాహం మే 11న జరిగింది. మే 20 నాటికి, కొత్తగా వివాహమైన జంట మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లింది. కనీ రాజా హత్యకు గురయ్యాడు..సోనమ్ కనిపించలేదు. వారు హనీమూన్ కోసం కాశ్మీర్‌కు వెళ్లాలనుకున్నారు, మేఘాలయకు కాదు. కానీ పు ఉగ్రవాద దాడి జరగడంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు. ఈ సమయంలో, ఒక రోజు సోనమ్ రాజాతో, కాశ్మీర్‌కు వెళ్లలేకపోతే మేఘాలయకు వెళదామని చెప్పింది. కానీ రాజాకు హనీమూన్‌కు వెళ్లాలనే ఆసక్తి లేదు. రాజా కుటుంబం కూడా నిరాకరించింది. అయినప్పటికీ సోనమ్ ఒత్తిడి చేసింది. స్వయంగా టిక్కెట్లు బుక్ చేసింది. రాజాకు మేఘాలయకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేకపోయింది.
ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే సోనమ్ చేసిదంది. రాజ్ అక్కడికి వెళ్లకపోయినప్పటికీ, సోనమ్‌తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. కాంట్రాక్ట్ కిల్లర్స్ విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్‌పుత్, ఆనంద్ తో రాజాను హత్య చేయించాడు. ఈ హత్యకు సోనమ్ సహకరించింది. హత్య తర్వాత, అతని శవాన్ని ఒక లోయలో పడేశారు.
సోనమ్ తన భర్తను ఎందుకు హత్య చేసిందనే ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి. సోనమ్ మరొకరిని ప్రేమించినట్లయితే, వివాహానికి నిరాకరించి ఉండాల్సింది. రాజాను హత్య చేయడం ఎందుకు అవసరమనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. నిందితులు షిల్లాంగ్‌లో ఆయుధాలను కొనుగోలు చేశారు. హత్య తర్వాత, రాజా టీ-షర్ట్, మొబైల్, ఆయుధాలను స్కూటర్ ట్రంక్‌లో పడేశారు. సోనమ్ కూడా హత్యకు గురై ఉంటే, ఆయుధాలు రాజా శవం సమీపంలో దొరికి ఉండేవని పోలీసులు అనుమానించారు. కానీ ఆయుధాలు వేరే చోట దొరకడంతో, సోనమ్ హత్యకు గురి కాలేదని, ఆమె ఈ కుట్రలో మాస్టర్‌మైండ్ అని స్పష్టమైంది. ఈ హత్యతో రెండు కుటుంబాలు విచ్చిన్నమైపోయాయి.