కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారిపోతున్నారు. కామవాంఛతో కన్నుమిన్ను కానక... అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  చిన్నారులను సైతం వదలిపెట్టడంలేదు. వయస్సుతో సంబంధంలేకుండా.. లైంగికదాడి చేస్తున్నారు. అభం శుభం తెలియని పసిపాపల జీవితాలతో ఆడుకుంటున్నారు.  మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలోనూ ఇలాంటి దారుణమే జరిగింది.


మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశారు జిమ్‌ ట్రైనర్‌ ఉపేందర్‌. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ  సంఘటన స్థానికంగా కలకలలం రేపింది. మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా కడుతున్న ఇంటికి బాలిక తల్లిదండ్రులు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అయితే.. సోమవారం పనిమీద  బయటకువెళ్లారు. ఇంటి దగ్గర బాలిక ఒక్కటే ఉంది. ఇంటి బయట ఆడుకుంటోంది. అదే కాలనీలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఉంపేదర్‌ బాలికను గమినించాడు.  


ఒంటరిగా ఉండటం చూసి.. ఎలాగైనా లోబరుచుకోవాలని ప్రయత్నించారు. చిన్నారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఆశ పెట్టాడు. జిమ్‌లోకి  తీసుకెళ్లాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా... చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని వయస్సు ఆ చిన్నారిది. అయినా  రెచ్చిపోయాడు కామాంధుడు ఉపేందర్‌. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 


ఇంతలో ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు... ఇంట్లో బాలిక లేకపోవడంతో అంతా వెతికారు. ఎక్కడా లేకపోవడంతో కంగారుపడ్డారు. అనుమానం వచ్చి పక్కనే ఉన్న జిమ్‌లోకి వెళ్లారు. అక్కడ బాలిక ఏడుస్తూ ఉండటం గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా... బాలిక విషయం వారితో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. జిమ్‌ ట్రైనర్‌ ఉపేందర్‌(29)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. చిన్నారులను చిధిమేస్తున్న ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతాయని... కఠిన శిక్షలు పడితేనే... మరో ఇలాంటి ఘాతుకాలకు తెగబడని అంటున్నారు. 


మేడిపల్లిలోనూ కాదు... తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అవకాశం దొరికితే చాలు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు కామాంధులు. చిన్నపిల్లలని కూడా చూడకుండా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పసిమొగ్గల జీవితాలను చిధిమేస్తున్న ఇలాంటి మృగాళ్లను ఏం చేయాలి..? ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి వారిలో మార్పు రాదా? ఆడపిల్లల మాన ప్రాణాలకు భరోసా కలగాలంటే ఇంకెన్ని చట్టాలు తేవాలి? ఇంకెన్ని కఠిన చర్యలు తీసుకోవాలి?