Tadepalli News : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ వృద్ధుడు వ్యక్తి కాళ్లపై పడి ప్రాధేయపడుతున్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను టీడీపీ కూడా పోస్టు చేసింది. తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓ విషయంలో కోటేశ్వరరావు, నాగిరెడ్డి అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది.  ఈ వీడియోలో వృద్ధుడు నాగిరెడ్డి కాళ్లపై పడి ప్రాధేయపడడం కనిపిస్తుంది. ఇద్దరు మహిళలు అతడ్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణను వీడియో తీస్తున్న మహిళను అడ్డుకునేందుకు నాగిరెడ్డి ప్రయత్నించాడు. అప్పుడు ఆ మహిళ భయంతో పారిపోయిన దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. 


అసలేం జరిగిందంటే? 


గుంటూరు జిల్లా పోలకంపాడుకు చెందిన అన్నదమ్ములు కోటేశ్వరరావు, శ్రీనివాసులకు 7 సెంట్ల స్థలం ఉంది. 2010లోఈ స్థలాన్ని పంచుకున్నారు. అన్న కోటేశ్వరరావుకు నాలుగు సెంట్లు, తమ్ముడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లు పంచుకుని నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావు తన మూడు సెంట్ల స్థలాన్ని నాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించారు. దీంతో నాగిరెడ్డి అక్కడ వరకూ గోడ కట్టుకున్నాడు. ఈ గోడను కోటేశ్వరరావు కూల్చివేశారు. ఈ ఘటనపై నాగిరెడ్డి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై శనివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వృద్ధుడైన కోటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగిరెడ్డికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి. 






సీఎం జగన్ స్పందించాలి : చంద్రబాబు 


తాడేపల్లిలోని పోలకంపాడులో వృద్ధుడి వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించాలని ట్వీట్ చేశారు. 


ఏపీలో సామాన్యులకు బతికే అవకాశం లేదు : లోకేశ్ 


వృద్ధుడి వీడియోపై ఏపీలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ ఘటనపై నారా లోకేశ్ శనివారం ట్వీట్ చేశారు.