ABP  WhatsApp

Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను సర్కార్ బ్యాన్ చేసిందా?

ABP Desam Updated at: 30 Apr 2022 03:05 PM (IST)
Edited By: Murali Krishna

Morth Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందా? ప్రస్తుతం ఈ వార్త తెగ హల్‌చల్‌ చేస్తుంది. మరి ఇందులో నిజమెంత?

ఎలక్ట్రిక్ వాహనాలను సర్కార్ బ్యాన్ చేసిందా?

NEXT PREV

Morth Electric Vehicles: ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో విద్యుత్ వాహనాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వార్తలు విన్న వారికి భయంగా ఉంది. దీంతో సదరు కంపెనీలు పలు స్కూటర్‌లు రీకాల్ కూడా చేశాయి. అయితే తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం బ్యాన్ విధించిందని వస్తోన్న వార్తలపై నిజమెంతో తెలుసుకుందాం


నిజమేనా?


ఈ వార్తలపై తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways-MoRTH) స్పందించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.


తాము కొత్తగా ఎలాంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారులను కోరలేదని ప్రభుత్వం తెలిపింది. అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని పేర్కొంది. ఈ వాదనలను నిరాధారమైనవి తప్పుదారి పట్టించేవని, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.



అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను లాంచ్ చేయవద్దని MoRTH ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులను కోరినట్లు మీడియాకి చెందిన ఒక విభాగం నివేదించింది. అలాంటి ఆదేశాలు, సూచనలేవీ మంత్రిత్వ శాఖ చేయలేదు. ఇలాంటి నివేదికలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి, అవాస్తవమైనవి.                                                          - రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ


వరుస ప్రమాదాలు


దేశంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వాహన తయారీదారుల తప్పు ఉన్నట్లు తేలితే భారీ జరిమానాలను విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీకాల్‌లను జారీ చేసి, ఈలోగా తమ ఉత్పత్తులను పరిష్కరించుకోవచ్చని మంత్రి సూచించారు. 


Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!


Also Read: CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!

Published at: 30 Apr 2022 03:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.