గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటు చేసుకుంది. మాదిపాడు సమీపంలోని వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. సాయంత్రం వేళ వేద పఠనం తరువాత విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అలాగే ఇవాళ సాయంత్రం ఏడుగురు విద్యార్థులు, వారితో పాటు ఉపాధ్యాయుడు స్నానానికి దిగారు. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారు. ఒకరు బయటపడి పోలీసులు సమాచారం తెలిపారు. దీంతో వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలు వెలికితీశారు. వీరందరూ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేదాలు నేర్చుకుంటున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి
వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో ఈతకు దిగి విద్యార్థులు మరణించటం దురదృష్టకరమన్నారు. సంఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి సురేష్.... విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభ్యం
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నక్కలవాగులో ఈనెల 7వ తేదీన గల్లంత్తెన విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు పృథ్వీరాజ్ రామచంద్రపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం సైకిల్ పై స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా నక్కలవాగు వద్ద అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. అధికారులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. ఇవాళ పృథ్వీరాజ్ పడిపోయిన చోటనే ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. విద్యార్థి మృతితో కుంట్రపాకం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో