కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక, బాలిక తల్లికి జూన్ లో కరోనా రావటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. బాలిక తల్లి చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సమయంలో ఆమె తండ్రి ఆసుపత్రికి వచ్చి వెళ్తుండేవాడు. అయితే ఓ మహిళ బాలికతో పరిచయం పెంచుకుంది. కరోనాకు ప్రకృతి వైద్యం చేయిస్తానని చెప్పి ఆమె ఇంటికి తీసుకెళ్లింది. బాలిక తండ్రికి కూడా వైద్యం చేయిస్తున్నట్లు మాయ మాటలు చెప్పింది. కొద్ది రోజుల తర్వాత బాలిక చేత వ్యభిచారం చేయించింది. గుంటూరుతో పాటు విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరుల్లో బాలిక చేత వ్యభిచారం చేయించారు. నెల్లూరు నుంచి పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను మరో ముఠా చేరదీసి అక్కడ కూడా వ్యభిచారం చేయించారు. అనారోగ్యం బారిన పడటంతో ఆమెను విజయవాడలో వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఇరవై మూడు మంది ఆ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదమూడు మందిని అరెస్ట్ చేసి వెయ్యి రూపాయల నగదు, కారు, బంగారు ఆభరణాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికకు జీజీహెచ్లో వైద్యం అందిస్తున్నారు. 


Also Read: నకిలీ  నోట్లతో మద్యం కొనుగోలు... తీగలాగితే దొంగనోట్ల ముఠా డొంక కదిలింది... ఏడుగురు అరెస్ట్, 45 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం


నాటు వైద్యం పేరుతో వ్యభిచారం


పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, కూతురికి కరోనా రావడంతో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించాడు. భార్య చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌లో మరణించింది. పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలిక వయసు 13 ఏళ్లు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రకృతి వైద్యం చేయిస్తానని తండ్రిని నమ్మించి బాలికను ఆమె వెంట తీసుకెళ్లింది. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని బాలికన ఒత్తిడి చేసింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను బెదిరించి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌ లో వ్యభిచారం చేయించారు. నెల్లూరులో ఆ కిరాతకుల చెర నుంచి తప్పించుకుని విజయవాడ వచ్చిన బాలికను మరో ముఠా బలవంతంగా తిరిగి వ్యభిచారం చేయించింది. అయితే బాలిక తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పడంతో తండ్రి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నాలుగు టీమ్ లుగా ఏర్పడి బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. ఈ కేసులో 23 మందిలో మొత్తం 10మంది ఆర్గనైజర్స్‌ ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. 


Also Read: Vangaveeti Radha Krishna: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి