ఆర్థికంగా నష్టపోయి లక్ష్మీ కటాక్షం కోసం మంత్రగాడిని ఓ మహిళ ఆశ్రయించింది. పూజలో ఒక్కరోజు నగ్నంగా కూర్చొంటే లక్షలలో డబ్బులు వచ్చి పడతాయని ఆ యువతులను తీసుకురమ్మని సూచించాడు. రాత్రికి రాత్రే ధనవంతులై పోవాలని ఆశ పడ్డ యువతులు నకిలీ పూజారి చెప్పినట్లు చేశారు. నగ్న పూజల పేరుతో కామ వాంఛలు తీర్చుకోవాలని ప్లాన్ చేశారని గ్రహించిన యువతులు తాము మోసపోయామంటూ తాంత్రిక పూజారి, మధ్యవర్తులపై ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే నిందితులు పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్క పెడుతున్నారు.


అసలేం జరిగిందంటే..
చిలకలూరిపేటకు చెందిన అరవింద బ్యూటి పార్లర్ నిర్వాహకురాలు. మరి కొన్ని వ్యాపారాలు చేసి ఆర్థకంగా తీవ్రంగా నష్ట పోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలు పోలేదు. ఇలాంటి సమయంలో పొన్నేకల్లు గ్రామానికి చెందిన తాంత్రిక పూజలు చేసే నాగేశ్వరరావుతో  ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఎటు వంటి సమస్యలకైనా తాత్రిక పూజలు ద్వారా దైవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చని.. తద్వారా ఆనుకున్న లక్ష్యం నెరవేరుతొందిని నకిలీ పూజారి చెప్పిన మాటలు అరవిందాను నమ్మేశా చేశాయి.  చేసిన ప్రతి వ్యాపరంలో నష్ట పోవడానికి కారణం దైవ ఆగ్రహం అని నాగేశ్వరరావు మాటలకు కనెక్ట్ అయింది. ఇలాంటి సమస్యలను ఎన్నిటినో పరిష్కరించాను అని నకిలీ పూజారా నమ్మ బలికాడు. పూజకు లక్ష రూపాయలు ఖర్చవుతాయని తెలిపాడు. పూజ పూర్తయిన తర్వాత‌ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని చెప్పాడు. లక్ష్మీ దేవి కటాక్షం సిద్దిస్తోందిని ఇంటిలో  కనక వర్షం కురుస్తోది అని మాటల‌ గారడీతో నమ్మించాడు. తాంత్రిక పూజ చేసేందుకు ముగ్గురు యువతులు కావాలని తెలిపాడు. వారు పూజలో నగ్నంగా కూర్చొన్నప్పుడే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని... నెగటివ్ ఎనర్జీ అంతమై పోతుందని నమ్మించాడు.


పూజలో కూర్చుంటే రోజుకు రూ.50 వేలు
పూజకు కావలసిన అమ్మాయిల కోసం తనకు గతలో పరిచయం ఉన్న నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన యువకులను సంప్రదించింది అరవింద.  వారు ముగ్గురు అమ్మాయిలను తెచ్చేందుకు సిద్దమయ్యారు. తమ ప్రాంతానికి చెందిన అత్యాశలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న అమ్మాయిలను  టార్గెట్ చేశారు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని వారిని నమ్మించారు. నగ్నంగా పూజలో కూర్చొంటే చాలు రోజుకు 50 వేలు వస్తాయని చెప్పి యువతులను తీసుకువచ్చారు.
ఇక లక్ష్మీ కటాక్ష తాంత్రిక యజ్ఞం తన స్వగ్రామం అయిన పొన్నేకల్లులో రహస్య ప్రాంతంలో ప్రారంభించాడు దొంగ పూజారి నాగేశ్వరరావు... యువతులను నగ్నంగా చేసి ప్రత్యేక పూజలు ప్రారంభించాడు..పూజ పేరుతో అభిషేకాలు, అర్చనల పేరుతో యువతులను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. చిరాకు వచ్చి మధ్యలో లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. అది దైవ ధిక్కారం, దైవ ఆగ్రహానికి గురవుతారని వారిని బెదిరించాడు ఆ మంత్రగాడు. రోజుకు 50 వేలు వస్తాయి కదా అని యువతులు ఆ బాధల్ని భరించారు. కానీ పూజకు అవరోధాలు కలిగి మధ్యలోనే ఆగిపోవడంతో చిలకలూరిపేటకు మకాం మార్చారు.


డబ్బు ఇవ్వక పోవడంతో నిలదీసిన యువతులు
పూజల సఫలం కావాలంటే మరోసారి నిష్టతో పూజ చేయాలని యువతులను నమ్మించి.. ఒక్కరోజు అని చెప్పి నాలుగు రోజులు  నగ్న పూజలు చేయించారు. తమకు డబ్బులు ఇవ్వాలని యువతులు మధ్యవర్తులను, పూజారిని నిలదీశారు. మరోసారి పూజలో కూర్చుంటే మొత్తం డబ్బులు ఇస్తామని నమ్మించే ప్రయత్నం చేయగా యువతులు జరిగిన మోసాన్ని గ్రహించి ఎదురుతిరిగారు. ఇక యువతులతో ప్రమాదం అని భావించి కారులో తీసుకెళ్లి ఓ చొట దించేశారు. బాధిత యువతులు తమ సన్నిహితులకు సమాచారం అందించాక, దిశా నెంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన నల్లపాడు పోలీసులు యువతులను పోలీస్టేషన్ కు తరలించి మధ్యవర్తులు, నకిలీ పూజారులపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా 12 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సౌత్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా తెలిపారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. డబ్బు కోసం పూజల పేరుతో చేసే ఇలాంటి వికృత కార్యక్రమాలు చేసే వారి వలలో పడవద్దని ప్రజలకు సూచించారు.