Gujarat officer kills wife and 2 children: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో అటవీ శాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్  శైలేష్ బాచు ఖంభ్లా (39) తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, శవాలను తన నివాసానికి సమీపంలోని పాతిపెట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లుగా మిస్సింగ్ కేసు పెట్టాడు. కానీ దొరికిపోయాడు.  దివారం రాత్రి పోలీసులు ఖంభ్లాను అరెస్ట్ చేశారు.    శైలేష్  భార్య నయనా (42), కుమారుడు భవ్య (9), కుమార్తె ప్రథా (13)లు నవంబర్ 5న భావ్‌నగర్‌లోని  అటవీ కాలనీలో ఉన్న ఖంభ్లా నివాసానికి సూరత్ నుంచి దీపావళి సందర్భంగా వచ్చారు. అదే రోజు ఉదయం 7 గంటల సమయంలో అతను తన డ్యూటీకి వెళ్లిన తర్వాత, నయనా పిల్లలతో కలిసి బయటకు వెళ్లిపోయారని ఖంభ్లా చెప్పాడు. కానీ, 10 రోజుల పాటు వారు తిరిగి రాలేదని, ఆటో రిక్షాలో వెళ్లిపోయారని అతను నవంబర్ 7న భారత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్   కేసు దాఖలు చేశాడు.                   

Continues below advertisement

అటవీ శాఖ అధికారి కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు బృందం  సీసీటీవీ ఫుటేజ్  ను చెక్ చేసింది.  నయనా లేదా పిల్లలు ఎవ్వరూ ఆ రోజు ఆటోలో వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీలో నమోదు కాలేదు.  మరోవైపు, కాలనీ సెక్యూరిటీ గార్డ్ కూడా వారిని చూడలేదని చెప్పాడు. ఖంభ్లా చెప్పిన విషయాల్లో స్పష్టత లేకపోవడం, అతని "స్ట్రేంజ్ బిహేవియర్",  మిస్సింగ్ కుటుంబం పట్ల అతనికి పెద్దగా ఆందోళన లేకపోవడం గమనించి పోలీసులు అతనిపైనే అనుమానం పెంచుకున్నారు.                      

నవంబర్ 16న  అటవీ శాఖ ఉద్యోగి ఇచ్చిన టిప్-ఆఫ్ ప్రకారం, ఖంభ్లా తన క్వార్టర్స్ సమీపంలో ఇటీవల ఒక  గొయ్యి తవ్వించాడని తెలుసుకున్నారు.  దీంతో, నవంబర్ 17న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వించారు. అక్కడ ఆరు అడుగుల లోతులో  నయనా, భవ్య, ప్రథా శవాలు  బయటపడ్డాయి.                   అరెస్ట్ తర్వాత పోలీసుల విచారణలో ఖంభ్లా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని అతను చెప్పాడు. హత్యకు ముందు  అటవీ సిబ్బందిని పిలిపించి గొయ్యిలు తవ్వించాడు. ఎందుకో చెప్పలేదు.  నవంబర్ 5న ఉదయం 7 గంటలకు మొదట భార్య నయనాను చంపాడు. తర్వాత కుమారుడు భవ్య, కుమార్తె ప్రథాను  దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. తర్వాత ముందుగా తవ్విన గొయ్యిల్లో పాతి పెట్టాడు.   ఖంభ్లా గత ఏడాది ప్రమోషన్ పొంది ఏసీఎఫ్‌గా భావ్‌నగర్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. గతంలో సౌరాష్ట్ర, మధ్య గుజరాత్‌లో కూడా పని చేశాడు. కుటుంబ సమస్యల కారణంగానే హత్య చేసినట్లుగా హంతకుడు ఒప్పుకున్నాడు.                        

Continues below advertisement