విజయవాడ: కానూరులోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలో పోలీసులు, ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన మావోయిస్టులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారుగా, హిడ్మా అనుచరులుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. నలుగురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసుల సహాయంతో ఆక్టోపస్ బలగాలు మావోయిస్టులను అరెస్ట్ చేసింది. అరెస్టయిన మావోయిస్టులు కానూరు పరిసర ప్రాంతాల్లో నాలుగు చోట్ల డంప్‌లు (ఆయుధాలు, పేలుడు పదార్థాలు దాచిన స్థావరాలు) ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం ఈ డంప్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అపార్ట్‌మెంట్లో తనిఖీలు..
కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఆయుధాల కలకలం రేగింది. ఈ ప్రాంతంలోని ఒక భవనంలో ఆయుధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం అక్టోపస్ (Octopus) బలగాలతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులు మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా, ఆయన భార్య సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అదేరోజు విజయవాడ, పెనమలూరు పరిసర ప్రాంతాల్లోనూ మావోయిస్టుల సంచారంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పలువుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.
కృష్ణా జిల్లాలోని పెనమలూరు ప్రాంతానికి భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు చేరుకున్నాయి. గన్నవరం పోలీస్ స్టేషన్, కంకిపాడు పోలీస్ స్టేషన్, ఏ ఆర్ (ఆర్మ్‌డ్ రిజర్వ్) విభాగాల నుండి అదనపు పోలీసు బలగాలు పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చాయి. ఈ బలగాలు ఆటోనగర్ 100 ఫీట్ రోడ్డులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రాంతంలో ఆయుధాల క పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి మావోయిస్టులు పెనమలూరులో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో మావోయిస్టుల కలకలం విజయవాడ నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం రేగింది. కానూరు ప్రాంతంలో సుమారు 10 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు, గ్రేహౌండ్స్ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకుని, వారిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. మిగిలిన ఆరుగురు మావోయిస్టుల కోసం పోలీస్ అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.