YSRCP leader Karumuru Venkat Reddy | హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరువెంకట్‌రెడ్డిఅరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో ఏపీలోని తాడిపత్రి పోలీసులు వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. వైసీపీ నేత కారుమూరివెంకట్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు నమోయ్యాయి.

వైసీపీ నేత వెంకట్‌రెడ్డిపై నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే, ఇటీవల తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్‌కుమార్‌ నవంబర్ 14వ తేదీన తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురయ్యాడు. దాంతో ఏపీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టలను దెబ్బతీసేలా వ్యవహరించడం, సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న వెంకట్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌కు వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా కారుమూరు వెంకట్ రెడ్డిపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వెంకట్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. వైసీపీ నేత కారుమూరును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తమను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కారుమూరు వెంకట్ రెడ్డి భార్య ఏమన్నారంటే..

తొలుత మా ఇంట్లోకివచ్చిన పోలీసులు జస్ట్ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చామని చెప్పారు. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పి.. ఆఖరిగా విచారణ కోసం తీసుకెళ్తున్నాం అన్నారు. ఇంట్లోకి వచ్చీ రాగానే పోలీసులు నా ఫోన్, మా ఆయన వెంకటరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు.. ఎవరికీ సమాచారం ఇవ్వొద్దుఅని బెదిరించారు. చాలా సేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికి ఇచ్చి వెంకటరెడ్డిని వారితో తీసుకెళ్లారు - కారుమూరువెంకటరెడ్డిసతీమణిహరిత