ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రౌడీ షీటర్ మంతెన సుమన్ దారుణ హత్యకు గురయ్యాడు. గోదావరిఖనిలో నడి రోడ్డుపైనే కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలు కాగా, ఓ వైపు రక్తస్రావం అవుతుంటే మరోవైపు కొన ప్రాణాలతో కొంచెం సమయం రౌడీ షీటర్ మంతెన సుమన్ కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో రౌడీ షీటర్ సుమన్ చనిపోయాడు. అయితే రౌడీ షీటర్ హత్యకు పాత కక్షలు కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరికి వచ్చి రాగానే ఈ సంఘటన ద్వారా నేరస్తులు సవాల్ విసిరినట్టయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


రెండు సార్లు రెక్కీ, పక్కా ప్లాన్ తో.. 
గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసుతో సంబంధం ఉన్న  ఐదుగురు నిందితుల అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై గుంటూరు రేంజ్ ఐజీ వేటు వేశారు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో గత ఏడాది అక్టోబర్ 18న రమేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును లాలాపేట పోలీసులు అతి కష్టం మీద ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 వేట కొడవళ్లు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. హత్యకు గురైన రమేష్ పై రౌడీషీట్ కూడా ఉండటంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. 


హైదరాబాద్‌లోనూ ఇలాంటి దారుణమే..


గత ఏడాది సెప్టెంబర్ నెలలో నడిరోడ్డుపై ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. హసన్ నగర్‌లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హోటల్ ముందు రౌడీ షీటర్ మునావర్ ఖాన్ అలియాస్ బాబూఖాన్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి హత్య చేశారు. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి రౌడీ షీటర్ బాబూ ఖాన్ హత్య హైదరాబాద్ లో కలకలం రేపింది. గతంలోనూ నగరంలో కొందరు రౌడీ షీటర్లను వారి ప్రత్యర్థి గ్రూపులు, రియల్ ఎస్టేట్ వివాదాల్లో అవతలి వర్గం వారు కిడ్నాప్ చేసి చివరికి హత్య చేసిన ఘటనలు జరిగాయి.


అసలేం జరిగిందంటే..
మునావర్ ఖాన్ అలియాస్ బాబూ ఖాన్ వయసు 38 ఏళ్లు. అతడిపై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలో రౌడీ షీట్ సైతం తెలిచినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బాబూ బాన్ హసన్ నగర్ ఓ హాటల్ వద్ద ఉండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో బాబూ ఖాన్ స్పాట్ లో మృతి చెందాడు.