Flipkart delivery Cruel murder : లక్నోలో డెలివరీకి వెళ్లిన ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ తిరిగి రాలేదు. డెలివరీ ఏజెంట్లుఅందరూ కలిసి వెదికారు. కానీ ఫలితం లభించలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇందిరా కెనాల్‌లో డెలివరీ బాయ్ మృత దేహం కనిపెట్టారు. ఆ సంచి కూడా అక్కడే ఉంది. చూస్తూంటే ప్రమాదవశాత్తూ చనిపోయినట్లుగా లేదు. ఎందుకంటే.. అటు వైపు అతనికి డెలివరీలు లేవు. ఏం జరిగిందా అని ఆరా తీసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. అసలు విషయం తెలిసి వారి ఒళ్లు చల్లబడిపోయింది. ఎందుకంటే..నేరం అలాంటిది మరి.
చనిపోయిన డెలివరీ బాయ్ పేరు భరత్ సాహు. సిన్సియర్ గా ఫ్లిప్ కార్ట్ వస్తువులు డెలివరీ చేస్తూంటాడు. ఎప్పట్లాగే అతను.. ఓ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అది ఐ ఫోన్ 16 ప్రో ఫోన్ . ఓపెన్ బాక్స్ డెలివరీ అని పెట్టాడు.అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. దాంతో డెలివరీ బాయ్ ను ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిన భరత్ సాహు .. బాక్స్ ఓపన్ చేసి చూపించాడు. మొత్తం లక్షన్నర రూపాయలు అయిందని ఇస్తే వెళ్లిపోతాన్నాడు. డబ్బులు తెస్తానని వెళ్లిన భరత్ సాహు..తనతో పాటు ఆయుధాన్ని తెచ్చాడు. భరత్ సాహును ఇష్టం వచ్చినట్లుగా కొట్టి చంపేశాడు.
శర్మ ఫ్యామిలీ కాదు పాకిస్తాన్ కుటుంబం - బెంగళూరులో పోలీసులకు చిక్కిన అనుమానితులు
ఐ ఫోన్ పై మోజుతో..ఆర్డర్ చేసుకున్న హంతకుడు.. డబ్బులు లేనందువల్ల డెలివరీబాయ్ ను హత్య చేసి పక్కన పడేసి ఫోన్ వాడుకుందామనుకున్నాడు. అనుకున్నట్లుగానే చేశాడు. ఏమి తెలియనట్లుగా ఉన్నాడు . కానీ భరత్ సాహు చేసిన చివరి డెలివరీ.. దానికి సంబంధించిన డబ్బులు రాకపోవడం..అతని బ్యాక్ లో ఫోన్ బాక్స్ కూడా లేకపోవడంతో అనుమానం వచ్చి హంతకుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు చూస్తే అది సాదాసీదాగా ఉంది. లక్షన్నర పెట్టి ఐ ఫోన్ కొనే స్థోమత లేదని తెలిసిపోయింది. దీంతో అక్కడే ఏదో మిస్టరీ ఉందని గుర్తించిన పోలీసులు.. ఆ వ్యక్తిని పట్టుకుని తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో నిజం ఒప్పేసుకున్నాడు.
స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ - బంగారం వ్యాపారి బలైపోయాడు !
ఫోన్ తీసుకు వచ్చే డెలివరీ బాయ్ ను చంపేసి ఫోన్ తీసుకోవాలన్న ప్లాన్ తోనే బుక్ చేసుకున్నానని తెలిపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. డెలివరీ బాయ్స్ అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని తేల్చి చెప్పిందని అంటున్నారు. అతి భారీ మొత్తాలకు క్యాష్ ఆన్ డెలివరీలు అంగీకరించకపోవడం మంచిదన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా డెలివరీ బాయ్ లు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో డెలివరీలు ఇస్తున్నారు.