Five Youth Died In Kondapochamma Sagar Dam In Siddipeta District: సిద్ధిపేట జిల్లాలో (Siddipeta District) శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో ప్రాజెక్ట్ సందర్శించడానికి వెళ్లిన ఏడుగురు యువకులు సెల్ఫీ కోసం సాగర్‌లో దిగి గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్‌ను (Kondapochamma Sagar Dam) సందర్శించేందుకు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు శనివారం వచ్చారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ డ్యామ్‌లోకి దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.