Severe Road Accident In Kavali: ఏపీలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా కావలి (Kavali) మండలం గౌరవరం గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతులు కావలి డివిజన్ పరిధిలోని జలదంచి మండలం చామదల గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.


Also Read: Thota Trimurtulu Case : అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?