Crime News in Telugu: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తోందన్న కోపంతో హత్య చేయిచాడో భర్త. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా డబ్బులు తగలేస్తోందన్న అసహనంతో ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి చంపించాడు. తెలిసిన వాళ్లకి రూ.2.5 లక్షల సుపారీ ఇచ్చి ఈ పని చేయించాడు. ముందు ఇది రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రించాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. ఆగస్టు 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయిందని చెప్పాడు. పది రోజుల తరవాత ఈ కేసు మలుపు తిరిగింది. భర్తే సుపారీ ఇచ్చి చంపించాడని విచారణలో తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హేమంత్ శర్మ తన భార్య దుర్గావతిని,ఆమె సోదరుడిని దగ్గర్లోని ఓ టెంపుల్‌కి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి బైక్‌పై తిరిగొచ్చే సమయంలో ఓ కార్‌ వచ్చి బలంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టింది. ఈ బైక్‌పై దుర్గావతితో పాటు ఆమె సోదరుడూ ఉన్నాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరుడు స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. 


ఇదంతా రోడ్ యాక్సిడెంట్ అని హేమంత్ శర్మ మభ్యపెట్టాడు. కానీ..అతనే సుపారీ ఇచ్చి కార్‌తో ఢీకొట్టించాడని విచారణలో వెల్లడైంది. పక్కా ప్లాన్ ప్రకారం టెంపుల్‌కి తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఈ హత్య  చేయించాడు. ముందు అంతా ఇది హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు. అయితే..అక్కడి సీసీ ఫుటేజ్‌ని, హేమంత్ శర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ని పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌కి ముందే అక్కడ కార్ నిలిపి ఉండడాన్ని గుర్తించారు. అప్పుడే నిజాలన్నీ బయటకు వచ్చాయి. అయితే...హేమంత్ శర్మకి దుర్గావతి రెండో భార్య అని తేలింది. 2023లో వీళ్లిద్దరికీ కోర్టులో వివాహమైంది. అయితే...భార్య విపరీతంగా ఖర్చులు పెడుతోందన్న కోపంతో ఉన్నాడు హేమంత్ శర్మ. ఇక భరించలేక ఇలా హత్య చేయించాడు. 


Also Read: Kolkata: జైల్‌ గార్డులతో ప్రత్యేకంగా మాట్లాడిన నిందితుడు, వెలుగులోకి షాకింగ్ విషయాలు!