Fake ENO manufacturing unit busted in Delhi: కడుపులో మంటా..యూనో వాడండి అనే ప్రచారం వైరల్ అయింది. రాజకీయ నేతలు కూడా దీనికి ఉచిత ప్రచారం చేస్తూ ఉంటారు. తాము చేసే మంచి పనుల వల్ల ఎదుటి వారికి కడుపులో మంటగా ఉందని..యూనో పంపుతామని సెటైర్లు వేస్తూంటారు. అయితే ఈ యూనోకూ ఫేక్‌లు వచ్చేశాయ..ిి
ఉత్తర ఢిల్లీలోని ఇబ్రహీంపూర్ ప్రాంతంలో హై-టెక్ ఫ్యాక్టరీని గుర్తించి దాడి చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రముఖ యాంటాసిడ్ బ్రాండ్ ENOకు ఫేక్ అక్కడ తయారు చేస్తున్నారు. తమ ప్రొడక్ట్‌కు పెద్ద ఎత్తున నకిలీలు వస్తున్నాయని గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ నకిలీ ఉత్పత్తులు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండటం గమనించారు. నకిలీలు ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని పోలీసులు తెలిపారు.
ఇబ్రహీంపూర్‌లోని రెంటెడ్ షాప్‌లో ఈ ఫ్యాక్టరీ నడుస్తోందని స్పష్టమైన మేరకు పోలీసులు దాడి డి చేశారు. అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉండేలా అధునాతన ప్యాకేజింగ్ మెషిన్లు, బ్రాండెడ్ లేబుల్స్ ఉపయోగించారు. ఫేక్ ENO 91,257 ప్యాకెట్లు మార్కెట్‌లోకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. 80 కేజీలుయాంటాసిడ్ తయారీకి ఉపయోగించే కెమికల్స్, , బ్రాండింగ్ షీట్లు 13.080 కేజీలు ENO లోగో, లేబుల్స్ ప్రింట్ చేసిన షీట్లు, స్టిక్కర్లు 54,780ఫేక్ లేబుల్స్, బ్యార్‌కోడ్‌లు .. ఫిల్ చేసి సీల్ చేసే అధునాతన యూనిట్ ను కూడా సీజ్ చేశారు. సబ్‌స్టాండర్డ్ మెటీరియల్స్ ఉపయోగించి ENO ప్యాకెట్లు తయారు చేస్తూ, అసలు బ్రాండ్‌కు సమానంగా చూపించేలా ప్యాకేజింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఫేక్ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వెళితే, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించేవని పోలీసులు చెప్పారు.
ఈ యూనిట్ చాలాకాలం నుంచి నడుస్తోందని, పెద్ద నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. . ఇటీవల ఢిల్లీలో ఫేక్ టూత్‌పేస్ట్, సిగరెట్లు, ENO వంటి FMCGలపై దాడులు పెరిగాయి, ఇది లోకల్ మార్కెట్లలో OTC (ఓవర్-ది-కౌంటర్) ఉత్పత్తుల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. కన్స్యూమర్లు అసలు ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు బార్‌కోడ్, ఎక్స్‌పైరీ డేట్‌లను తప్పకుండా చెక్ చేయాలని పోలీసులు సూచించారు.