Rahul Gandhi not seen in Bihar election campaign: బీహార్ ఎన్నికలకు ముందు ఓట్ చోరీ యాత్రను చేసిన రాహుల్ గాందీ..తీరా ఎన్నికల సమయం వచ్చి.. ప్రచారం పీక్స్ కు చేరే సరికి కనించకుండా పోయారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారంలో కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. "రాహుల్ గాంధీ ఎక్కడ?" అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార బాధ్యతను ఆయన ఒక్కరే మోస్తున్నారు. రాహుల్ గాంధీ బిహార్‌లో సభలు నిర్వహించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
బిహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలక పరీక్షగా మారాయి. పరిస్థితి అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన సైలెంట్ అయిపోయారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 61 సీట్లలో పోీట చేస్తోంది. అన్నిపార్టీలు ఎక్కువ సీట్లలో గెలిస్తేనే కూటమి విజయం సాధ్యమవుతుంది. ఆర్జేడీ పోటీ చేసే చోట తేజస్వీ ఎక్కువ దృష్టి పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రచారం మాత్రం అనాథగా మారింది. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయడం మానేశారు. రాహుల్ గాంధీ పట్టించుకోకపోవడం వల్ల పార్టీలోని కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ రాష్ట్రంలో అన్ని చోట్లా తిరుగుతున్నారు. ఆయన ఒక్కడే కూటమి ప్రచార భారం మోయడం ..రాహుల్ గాంధీ లేకపోవడం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని BJP మకూటమికి అవకాశంగా మారింది. ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని మోదీ కూడా ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బీహార్ ను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదో కానీ.. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన ప్రచారానికి రావాలని ఒత్తిడి చేయడం లేదు.
బీహార్‌లో రాహుల్ గాంధీ ప్రధానంగా ఓటు చోరీ అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేాశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఓట్ల తొలగించారని ఆరోపించారు.కానీ జాబితా ప్రకటించిన తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు. అందుకే అక్కడి ప్రజలు కూడా.. రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.