EC SIR 12 states to be covered under phase 2: ఎ భారతదేశంలో రెండు దశాబ్దాల తర్వాత పెద్ద ఎత్తున వోటర్ లిస్టుల సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR ప్రారంభానికి ఎన్నికల సంఘం (ECI) ముహూర్తం ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబర్ 28 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో వోటర్ లిస్టులు అర్థరాత్రి నుంచి నుంచి ఫ్రీజ్ అవుతాయి. డూప్లికేట్, మరణించిన వోటర్లు, అర్హత లేని వారి పేర్లను తొలగించి, క్లీన్ లిస్టులు తయారు చేసేందుకు ECI ఈ చర్య తీసుకుంటోంది.
అండమాన్ & నికోబార్ ఐలాండ్స్, , గోవా, , పుదుచ్చేరి, చత్తీస్‌ఘడ్, , గుజరాత్, , కేరళ, , మధ్యప్రదేశ్ ,ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, లక్షద్వీప్ రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ రాష్ట్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) మంగళవారం నుంచి ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్తారు. ప్రీ-ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లు పంచుతారు. 2003 వోటర్ లిస్ట్‌లో పేర్లు ఉన్నవారికి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు. ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపుకాదు.
ఈ రాష్ట్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) మంగళవారం నుంచి ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్తారు. ప్రీ-ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లు పంచుతారు. 2003 వోటర్ లిస్ట్‌లో పేర్లు ఉన్నవారికి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు. ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపుకాదు.
బీహార్ మోడల్ ప్రకారం ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్‌గా మాత్రమే. 2002-04 SIR లిస్ట్ http://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని చీఫ్ ఎలక్షనల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మంగళవారం పార్టీలతో సమావేశమై SIR ప్రాసెస్‌ను వివరిస్తారు. బీహార్‌లో మొదటి దశ SIR జరిగి, జీరో అప్పీల్స్‌తో పూర్తయిందని CEC తెలిపారు. ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.