MG Windsor vs Tata Nexon EV Range Comparison: ప్రస్తుతం, భారత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లో ఉన్న రెండు బలమైన కార్లు - MG Windsor EV (38 kWh వేరియంట్) & Tata Nexon EV 45 (45 kWh వేరియంట్). వీటి ధరలు, బ్యాటరీ సామర్థ్యాలు దాదాపుగా విరుద్ధంగా ఉండగా, రియల్ వరల్డ్ డ్రైవింగ్‌లో ఏ కారు మెరుగ్గా నిలిచిందో చూద్దాం.
స్పెక్‌లు & క్లెయిమ్డ్ రేంజ్
MG Windsor EV 38 kWh వేరియంట్ కోసం ARAI క్లెయిమ్ చేసిన రేంజ్ సుమారు 331 కి.మీ.లు
Tata Nexon EV 45 kWh వేరియంట్ కోసం ARAI క్లెయిమ్ రేంజ్ సుమారు 489 కి.మీ.లు
వాస్తవ డ్రైవింగ్‌లో టెస్ట్ ఫలితాలు
Windsor 38 kWh టెస్ట్.... సిటీ రన్ = 327 కి.మీ.; హైవే రన్ = 289 కి.మీ.; మిక్స్ (సిటీ+హైవే) సుమారు 308 కి.మీ.లు; ఎఫిషియెన్సీ = సుమారు 8.1 km/kWh.
Nexon EV 45 kWh టెస్ట్.... సిటీ రన్ = 355 కి.మీ.; హైవే రన్ = 345 కి.మీ.; మిక్స్ సుమారు 350 కిమీలు. ఎఫిషియెన్సీ = సుమారు 7.79 km/kWh.
ఫలితాల విశ్లేషణ
దీనిని బట్టి.. సుమారుగా Windsor కంటే Nexon EV 45 kWh సింగిల్ ఛార్జ్‌లో దాదాపు 42 కి.మీ.లు ఎక్కువ దూరం వెళ్లగలదు. కానీ Windsor, బ్యాటరీ సామర్థ్యం (km/kWh) పరంగా Nexon EV కంటే మెరుగ్గా ఉందని టెస్ట్‌లో స్పష్టం అయ్యింది.
బ్యాటరీ సామర్థ్యం
ఎలక్ట్రిక్ వాహనాల్లో ‘ఒక్క యూనిట్ బ్యాటరీ నుంచి ఎన్ని కి.మీ.లు ప్రయాణించవచ్చు’ అనే ప్రశ్న చాలా ముఖ్యం. Windsor విషయంలో ఈ ప్రశ్నకు ఉత్తమ సమాధానం వచ్చింది.
టాటా నెక్సన్ ఈవీకి పెద్ద బ్యాటరీ ఉండటంతో దీనికి ‘బిగ్గర్ రేంజ్’ అనే ఫోకస్ ఉన్నప్పటికీ, ఎఫిషియన్సీ లెక్కల్లో కొంచెం వెనుకబడింది.
డ్రైవ్ పరిస్థితులు, వేగం, ఏసీ వాడకం అన్నీ ఈ టెస్ట్ ఫలితాలపై ప్రభావం చూపాయి. టెస్ట్‌లో, సాధారణ వినియోగ పరిస్థితులను లెక్కలోకి తీసుకున్నారు.
ఎవరికి ఏది సరిపోతుంది?
రోజువారీ డ్రైవింగ్ కోసం లేదా వృత్తి ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ కారు కావాలనుకుంటే. Windsor 38 kWh వేరియంట్ సరైన ఎంపిక కావచ్చు. తక్కువ ధరలో మంచి సామర్థ్యం ఉన్న కారు ఇది.
ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కావాలని కోరుకుంటే, Nexon EV 45 kWh ని పరిశీలించవచ్చు. సింగిల్ ఛార్జ్‌లో ఎక్కువ ప్రయాణం చేయడానికి వీలవుతుంది.
కారు కొనేటప్పుడు చార్జింగ్ క్యాపబిలిటీ, బ్యాటరీ లైఫ్, రీసేల్ వాల్యూ వంటి అంశాలను సైతం పరిశీలించాలి, గుర్తుంచుకోండి.
“EVల విషయంలో సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ కి.మీ.లు అన్న లెక్క మాత్రమే కాదు. ఒక్క యూనిట్ బ్యాటరీ నుంచి ఎంత రేంజ్ రాబట్టవచ్చు” అన్నది కూడా కీలకం అని ఈ టెస్ట్ ఫలితాలను బట్టి మనం స్పష్టంగా తెలుస్తుంది.
మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ డ్రైవింగ్ స్టైల్, ఛార్జింగ్ వసతి, వాహన వినియోగంలో ఉదయం/సాయంత్రం పరిస్థితులు వంటి వాటిని విశ్లేషించండి. ఈ రెండు కార్లూ, వ్యక్తిగత ప్రాధాన్యతల అనుగుణంగా బాగా పని చేయగలవు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.