బెంగళూరులో ఓ టెకీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)ను హత్య చేశాడు. ఇతను అదే కంపెనీలో గతంలో పని చేశాడు. ఈ మాజీ ఉద్యోగి వారి కార్యాలయంలోకి చొరబడి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.


ఏరోనిక్స్‌ ఇంటర్నెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో విను కుమార్‌ కు తీవ్ర గాయాలు కావడంతో సహోద్యోగులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఇద్దరూ మధ్యలోనే మృతి చెందారు. దాడి చేసిన వ్యక్తి ఫెలిక్స్ అని గుర్తించారు. అతను పరారీలో ఉన్నట్లు బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.