మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. టీతోపాటు టిఫిన్ ఇవ్వలేదని కోడలితో మామ గొడవ పడ్డాడు. అది కాస్త శ్రుతి మించిందిపోయింది. కోపాన్ని ఆపుకోలేకపోయిన అతను తన తుపాకీ తీసి కాల్పులు జరిపాడు.
మామ జరిపిన కాల్పుల్ల కోడలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
థానే సిటీలో కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ అనే 76 ఏళ్ల వ్యక్తి కుమారుడి ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగానే గురువారం ఉదయం 11.30 నిమిషాలకు కోడలు టీ తీసుకొచ్చి ఇచ్చింది. దాన్ని చూసిన కాశీనాథ్ ... టిఫిన్ ఏదని అడిగాడు. రెడీ అవుతుందని చెప్పింది.
ఆమె సమాధానం విన్న పెద్దాయనకు కోపం కట్టలు తెంచుకుంది. టీ, కాఫీ రెండూ తీసుకొచ్చి ఇవ్వడం తెలియదా అంటూ గొడవపడ్డాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుండగానే తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు కాశీనాథ్ పాండరంగ్ పాటిల్. దీంతో బుల్లెట్ కోడలి పొట్టలోకి దూసుకెళ్లాయి. దీన్ని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు.
గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కోడలిపై గన్‌తో కాల్పులు జరిగిన కాశీనాత్ పాండురంగ్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) 506(నేరపూరిత బెదిరింపు) కింద కేసులు రిజిస్టర్ చేశారు.
ఈ ఘటనపై రెండో కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మామను ఇంకా అరెస్టు చేయలేదు.