తెలంగాణ పోలీసులను డ్రగ్స్ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వెంట పడుతోంది. హైకోర్టు ఆదేశించినప్పటికీ తమకు టెక్నికల్ సాక్ష్యాలు ఇవ్వడం లేదని ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటోందని ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తెలిపింది.
డ్రగ్స్ కేసులో ఈడీకి ఎందుకు సహకరించట్లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
గతంలో ఎక్సైజ్ శాఖ సినీతారలు సహా 41మందిని ఎక్సైజ్ శాఖ విచారించింది. డిజిటల్ రికార్డ్స్ , వాంగ్మూలాలు, కాల్ రికార్డ్స్ నమోదు చేసింది. అయితే వాటిని ఈడీకి ఇవ్వలేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసును ఈడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఎక్సైజ్ శాఖ ఆ వివరాలన్నీ ఈడీకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఇవ్వలేదు. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్లో ఈడీ పేర్కొంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి, ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ
తాము సేకరించిన ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ గతంలో వాదించింది. కానీ అది నిజం కాదని.. ట్రయల్ కోర్టులో లేవని ఈడీ చెబుతోంది. 12కేసుల్లో 23మంది నిందితులున్నా ఐదుగురు వాంగ్మూలాలు మాత్రమే ట్రైల్ కోర్టులో లభ్యం అయ్యాయని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. సోమవారం ఈడీ పిటీషన్ పై విచారించనుంది హైకోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడి మరీ సాక్ష్యాలను ఎందుకు ఈడీకి ఇవ్వకుండా తాత్సాహం చేస్తున్నారనేది సస్పెన్స్‌గా మారింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు.. ఈడీకి సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డ్రగ్స్ కేసు ప్రధానంగా టాలీవుడ్ తారల చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో తారలందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. వారెవరికైనా డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న విషయాలు బయటపడలేదని కోర్టుకు తెలిపింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసులు తేలిపోయాయనుకున్నారు. కానీ.. కొత్తగా ఈడీ ఈకేసులో నిజాలు వెలికి తీయాలని ప్రయత్నిస్తూండటంతో టాలీవుడ్‌లోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.