East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో కాలిన గడ్డి వాములో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఈ  సంఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి సీఐ పి.శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామ శివారులో చిన్న తలుపులమ్మ లోవ (చిన లోవ) సమీపంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి చేనును గోవిందు కౌలుకు తీసుకున్నాడు.  గోవిందు శుక్రవారం ఉదయం తన పొలం దగ్గరకు వచ్చేసరికి పొలం గట్టు పైన ఉన్న గడ్డివాము తగలబడడం గమనించి వెళ్లి చూసేసరికి గడ్డి వాములో ఒక శవం పూర్తిగా కాలిపోవడం చూశాడు. వెంటనే రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూసేసరికి శవం పూర్తిగా కాలిపోవడం పక్కన మహిళకు సంబంధించిన చెప్పులు, గాజు పెంకులు గుర్తించారు పోలీసులు. కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు పోలీసులు. చెప్పులు, గాజు పెంకులు ఆధారంగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తిని హత్య చేసి సోమేశ్వరం శివారు తలుపులమ్మ లోవ వద్ద  గోవిందు చేనులోని గడ్డివాములో ఉంచి తగలబెట్టి ఉంటారని, కౌలు రైతు గోవిందు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పొలం చూడడానికి వచ్చేసరికి గడ్డివాము తగలబడి దాంట్లో ఒక శవం గుర్తుపట్టలేని విధంగా పూర్తికే కాలిపోవడం ఉండడాన్ని గమనించి పోలీసులు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.  


హత్య చేసి తగులబెట్టారని ప్రాథమికంగా నిర్ధారణకు 


మండపేటలోని ఓ రైతు పొలంలో గడ్డివాములో దగ్ధమైన మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి తగులబెట్టారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్య గురైంది పురుషుడా, యువతి లేక వివాహిత అనే కోణంలో దర్యాప్తులో తెలియాల్సి ఉందని సీఐ గణేష్ తెలిపారు. ఘటనా స్థలంలో మహిళ చెప్పులు, గాజులు పగిలి ఉండడం మహిళ మృతదేహంగా అనుమానిస్తున్నారు.  మృతదేహం ఎవరు అనేది తెలియాలంటే ఆయా పోలీస్ స్టేషన్లలో అదృశ్యంపై కేసు నమోదైన వారి వివరాలను సేకరించి, ఈ ఆధారాల ఆధారంగా ఎవరైనా గుర్తించిన్నట్లయితే రాయవరం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై కౌలు రైతు గోవిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ శివ గణేష్ తెలిపారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్ర రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


నెల్లూరులో పరువు హత్య?


 రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేశాడు. ఆమె అంతకు ముందే ఓ అబ్బాయిని ప్రేమించింది. వేరే వ్యక్తితో పెళ్లై రెండేళ్ల గడుస్తున్నా అతడిని మర్చిపోలేక పోతోంది. ఇప్పటికీ వారిద్దరి మధ్య రిలేషన్ ఉండడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి.. కూతురు కుటుంబం పరువు తీస్తుందని భావించి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి తల, మొండం వేరు చేసి ఒక్కో చోట పడేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. కానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 


అసలేం జరిగిందంటే..?


నంద్యాల జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రసన్నకు  ఏళ్లు. రెండేళ్ల క్రితమే ఆమెను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరుకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. వారిద్దరూ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. అయితే పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించింది. అతనితో సాన్నిహిత్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసిన ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేందర్ రెడ్డి కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. కూతురును చంపి అయినా సరే పరువు కాపాడుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల వ తేదీన కూతురు గొంతు నులిమి హత్యే చేశాడు. అనంతరం మరికొందరితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యా-గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తల, మొండం వేరు చేసి మరీ ఒక్కోదాన్ని ఒక్కో చోట పడేశారు. తిరిగొచ్చి ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చి ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. దేవేందర్ రెడ్డికి గట్టిగా నిలదీయడంతో పరువు పోయిందని కుమార్తెను చంపినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు గురువారం దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. రోజంతా గాలించినా దొరకలేదు. శుక్రవారం మళ్లీ గాలించగా తొల, మొండం దొరికాయి. పోస్టుమార్టం కోసం వాటిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.