Drunken Attack On Traffic Constable In Visakha: మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని వీరంగం సృష్టించాడు. ఒకానొక దశలో కానిస్టేబుల్ పై చేయి కూడా చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ (Visakha) జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ఎన్ఏడీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్ పై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని హల్చల్ చేస్తూ.. ఆయనపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రేగగా.. పోలీసులు ఆ యువకున్ని పట్టుకున్నారు. చుట్టూ ఉన్న వారు ఆపుతున్నా యువకుడు వీరంగం ఆపలేదు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
Also Read: AB Venkateshwar Rao: పోస్టింగ్ ఇప్పించాలంటూ ఎన్నికల కమిషన్ కు ఏబీవీ లేఖ