Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని గోకుల్ పురిలోని గుడిసెల్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటలపాటు శ్రమించాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం.


ఢిల్లీ గోకుల్ పురిలో విషాదం.. 
ఢిల్లీలోని గోకుల్ పురిలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం (Gokulpuri Fire Accident) చోటుచేసుకుంది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. గుడిసెలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా వాటిల్లినట్లు తెలుస్తోంది. నిద్రపోతున్న సమయం కనుక, మంటల్ని త్వరగా గుర్తించక పోవడంతో పెను నష్టాన్ని మిగిల్చింది అగ్ని ప్రమాదం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎంగానో శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. చిన్నారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. 






అర్ధరాత్రి కావడంతో ప్రాణ నష్టం అధికం..
అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు స్పందించారు. శుక్రవారం అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట ప్రాంతంలో గోకుల్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించిన జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నార్త్ ఈస్ట్ ఢిల్లీ అడిషనల్ డీసీపీ జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. తెల్లవారేసరికి మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. కానీ మంటల్లో 30 వరకు గుడిసెలు దగ్దమమ్యాయని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు చనిపోయారని, మరికొందరికి కాలిన గాయాలైనట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు.






Also Read: She Is A Man: నా భార్య స్త్రీ కాదు, న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త - విచారణకు ధర్మాసనం ఓకే


Also Read: Machilipatnam Rape: సరదాగా బీచ్‌కి వెళ్లిన లవర్స్, ఇంతలో ఊహించని ఘటన - ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి అతని ముందే యువతిపై రేప్!