Delhi Ashram Baba Molested Women For Years: దిల్లీ వసంత్ కుంజ్‌లో శ్రీ శారదా పీఠం స్థాపించినట్లుగా నడుస్తున్న శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (SSIMR) డైరెక్టర్, స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిపై లైంగిక వేధిపుల కేసు నమోదు అయింది. ఆయనపై 17 మంది మహిళా విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 62 ఏళ్ల ఈ స్వయం ప్రకటిత బాబా.. రాత్రి వేళల్లో విద్యార్థులను తన గదికి పిలిపించి శారీరక సంబంధం బలవంతం చేసినట్లు FIRలో పోలీసులుతెలిపారు. రహస్య కెమెరాలు, అసభ్య SMSలు, విదేశీ పర్యటనల్లో బెడ్‌రూమ్‌లకు పిలవడం వంటి షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. అన్నీ బయటపడిన పరారైన బాబాను ఆగ్రాలో పట్టుకున్నారు.
వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన FIR ప్రకారం, స్వామి చైతన్యానంద సరస్వతి మహిళా వసతి గ్రహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ కెమెరాల ద్వారా విద్యార్థులను టార్గెట్ చేసి, వారి ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరించాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలో చేరిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ద్యార్థులను ప్రధానంగా ఎంపిక చేసుకున్నాడు. వారిని విదేశీ పర్యటనలకు తీసుకెళ్లి, అక్కడ రాత్రి వేళల్లో తన గదికి పిలిపించి లైంగిక అత్యాచారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక 21 ఏళ్ల విద్యార్థిని "బేబీ, ఐ లవ్ యూ. ఐ అడార్ యూ, యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే" అని మెసేజ్ చేసి, ఆమె జుట్టుపై కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. మరో మెసేజ్‌లో "కమ్ టు మై రూమ్... ఐ'ల్ టేక్ యూ ఆన్ ఎ ట్రిప్ అబ్రాడ్, యూ వౌంట్ హావ్ టు పే ఎనీథింగ్" అని పంపి, ఆమెను తన గదికి పిలిపించడానికి ప్రయత్నించాడు. 17 మంది విద్యార్థులను లైంగికంగా, మానసికంగా వేధించినట్లుగా తేలింది. ముగ్గురు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వారు చెప్పిన వివరాల ప్రకారం, స్వామి చైతన్యానంద వారిని రాత్రి 11 గంటల తర్వాత తన గదికి రమ్మని ఆదేశించేవాడు. తిరస్కరించిన వారిపై సస్పెన్షన్, డిగ్రీలు, డాక్యుమెంట్లు రుద్దడం వంటి చర్యలతో బెదిరించేవాడు. ఒక విద్యార్థిని "నీ హెయిర్ లుక్స్ అమేజింగ్" అని ప్రశంసిస్తూ, తన మునుపటి మెసేజ్‌కు రిప్లై ఇవ్వమని ట్యాగ్ చేశాడు. అసోసియేట్ డీన్‌కు చెప్పగా, "రిప్లై చెయ్" అని సూచించారు. ఈ విధంగా మిగిలిన విద్యార్థులకు కూడా ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక స్థితి బలహీనమైన వీళ్లు స్కాలర్‌షిప్‌లపై చదువుతున్నందున, ఈ బెదిరింపులు మరింత భయపెట్టాయి. ఈ ఆరోపణలు జులై 28, 2025న ఒక విద్యార్థి, ఆగస్ట్ 1న ఎయిర్ ఫోర్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని గ్రూప్ క్యాప్టెన్ ర్యాంక్ అధికారి నుంచి శ్రీ శారదా పీఠానికి వచ్చాయి. ఆగస్ట్ 3న 30 మంది మహిళా విద్యార్థులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో 32 మంది విద్యార్థుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు, వీటిలో 17 మంది ఆరోపణలు చేశారు. దిల్లీ పోలీసులు IPC సెక్షన్లు 354 (శారీరక హరాస్‌మెంట్), 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్)తో కలిపి కేసు నమోదు చేశారు. వెంటనే శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం, ఆరోపితుడితో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించింది.