President Droupadi Murmu Fake FB: సోషల్ మీడియా (Social media)లో ఏ వ్యక్తి అయినా నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించి వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసే కేసులు తరచుగా తెరపైకి వస్తున్నాయి. చాలా సార్లు మోసగాళ్లు హై ప్రొఫైల్ వ్యక్తుల పేరు(Person names)తో ఖాతాలు సృష్టించి మోసానికి పాల్పడుతున్నారు. అదే స‌మ‌యంలో మీరు లాట‌రీ త‌గిలింద‌ని.. మీ పేరుతో ప్రైజ్‌మ‌నీ(Prizemoney) వ‌చ్చింద‌ని చెప్పి కూడా.. మోసాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. తాజాగా ఓ సైబ‌ర్ నేర‌గాడు ఏకంగా రాష్ట్ర‌ప‌తి(President) ద్రౌప‌ది ముర్ము(Droupadi murmu) పేరుతో ఓ న‌కిలీ ఫేస్‌బుక్(Facebook) ఖాతాను సృష్టించి... ప్ర‌జ‌ల నుంచి సొమ్ములు వ‌సూలు చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌డంతో అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 


ఏం జ‌రిగింది? 


సైబ‌ర్ నేర‌గాడు ఒక‌రు.. రాష్ట్ర‌ప‌తి పేరుతో న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేశాడు. దాని నుంచి విరాళాలు కోరుతూ సందేశాలు పంపిస్తున్నాడు. ఈ క్ర‌మంలో జార్ఖండ్(Jharkhand) రాజ‌ధాని రాంచీ(Ranchi) నగరంలో ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నివాసముంటున్న మంటూ సోనీ అనే ఫేస్‌బుక్ (Face book) వినియోగదారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. హజారీబాగ్‌కు చెందిన మంటూ సోనీ(Mantu Soni)కి కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ఖాతా నుంచి `ఫ్రెండ్‌` రిక్వెస్ట్‌ వచ్చింది. దానిలో ప్రొఫైల్ పిక్చర్, ఇతర సమాచారం ఉంది. రాష్ట్రపతి పేరుతో ఉన్న ఈ ఫేక్ ప్రొఫైల్ నుంచి వ‌చ్చిన మెసేజ్‌లో ‘‘జై హింద్. ఎలా ఉన్నారు?’’ అని రాసి ఉంది. దీంతో ఇది నిజ‌మేన‌ని మంటూ అనుకున్నారు. 


Also Read: తండ్రి ఉద్యోగ బెనిఫిట్స్ కోసం దారుణం - సోదరులను చంపేసిన సోదరి, మృతదేహాలు మిస్సింగ్!


నెమ్మ‌దిగా వ‌ల విసిరి!


ఇక‌, ఆ త‌ర్వ‌త "నేను ఫేస్‌బుక్‌ను చాలా అరుదుగా ఉపయోగిస్తాను, నాకు మీ వాట్సాప్ నంబర్ పంపండి`` అని పేర్కొన‌డంతో మంటూ మ‌రింత‌గా న‌మ్మి.. తన వాట్సాప్ నంబర్ ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఒక సందేశం వచ్చింది. “మేము మీ నంబర్‌ను సేవ్ చేసాము. మా వాట్సాప్ కోడ్‌ని మీకు పంపాము, అది మీ వాట్సాప్‌కి వెళ్ళింది. దయచేసి మాకు త్వరగా కోడ్ పంపండి. ఇది 6 అంకెల కోడ్‌(Code)`` అని పేర్కొన్నాడు. దీనిపై మంటూకు ప‌లు సందేహాలు త‌లెత్తాయి. వెంట‌నే సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా జార్ఖండ్ పోలీసులకు ఈ వ్య‌వ‌హారం తెలిపి.. రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేస్తూ కేసు గురించి సమాచారాన్ని పంచుకున్నాడు. 


ద‌ర్యాప్తు.. 


సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌ ఫిర్యాదు అందిన వెంటనే రాంచీ పోలీసులు రంగంలోకి దిగారు. మంటూ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా.. సైబ‌ర్ నేర‌గాడి కూపీ లాగే ప‌ని బ‌ట్టారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఎస్పీ రాంచీ చందన్ సిన్హా(Chandana sinha) తెలిపారు.


Also Read: ఉద్యోగం మానేస్తా అని చెప్పలేక చేతివేళ్లనే నరికేసుకున్న గుజరాత్ వ్యక్తి. అసలేం జరిగిందంటే..