CP Sudhir Babu wonders how Gurumurthy actually committed this murder: సంచలనం సృష్టించిన మీర్‌పేటలో నాగమాధవి హత్య కేసులో పోలీసులు కూడా ఊహించనంత పకడ్బందీగా హత్యను పూర్తి చేశాడు గురుమూర్తి. ఇలా ఎలా చేశాడో అర్థం కావడం లేదని తన సర్వీసులో ఎన్నో నేరాలను చూసిన పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. 


భార్య నాగమాధవిని హత్య చేసేందుకు గురుమూర్తి ప్రణాళికా బద్దంగా వ్యవహరించారడన్నారు. హత్య చేయాలన్న ఉద్దేశంతో పిల్లలను ముందుగానే బంధువుల ఇంట్లో వదిలి పెట్టి వచ్చాడన్నారు. తర్వాత అత్యంత ఘోరంగా హత్య చేసి బాడీని డిస్పోజ్ చేశారన్నారు. సాంకేతిక ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. అత్యంత క్లిష్టమైన కేసుస అయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో సహా కేసును ఫ్రూవ్ చేస్తామని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినా గురుమూర్తిలో చిన్న పశ్చాత్తాపం కూడా లేదన్నారు.


హత్య ఎలా చేశాడంటే ? 


కావాలని గొడవ పెట్టుకుని ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెస్పృహ కోల్పోయిన ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.  కిచెన్ లో నుండి కత్తి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు .  ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు . ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడు . బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు.  బాగా శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడు. ఎముకలను రోట్లో దంచి పౌడర్ చేశాడు . ఆ పౌడర్ ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడు . కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడు గురుమూర్తి . వాసన రాకుండా ఉండేందుకు చేశాడు . సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు. డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడు గురుమూర్తి


హత్యకు మొత్తం పదహారు రకాల పరికరాలు ఉపయోగించారు. మొత్తం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య ఎలా జరిగిందో సీపీ వివరించారు. జనవరి పదహారో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే నాగ మాధవిని గురుమార్తి హత్య చేశాడు. ఆ తర్వాత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని ఉడకబెట్టాడు. ఎముకల్ని తీసి పొడి చేసి చెరువులో పడేశాడు. గురుమూర్తిని పోలీసులు ఇంటికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్న్ చేశారు.  


ఈ కేసును కోర్టులో నిరూపించడం ఓ సవాలేనని స్వయంగా సీపీ అంగీకరించినట్లయింది. గురుమార్తి తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. భార్యను ముక్కలుగా నరికి ఉడికించి.చెరువులో పడేశానని చెప్పాడు. అయితే అతని నేరాంగీకారం మాత్రమే పోలీసు వద్ద ఉంది. బాడీలోని చిన్న పార్టులు కూడా దొరకలేదు. ఈ కారణంగా ఆమె హత్యకు గురయిందని ఎలా చెబుతారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సైంటిఫిక్ సాక్ష్యాలతో పోలీసులు కోర్టులో ఫ్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఆధారాలు దొరకకుండా రసాయినాలను కూడా పక్కాగా వాడటంతో.. డీఎన్ఏ.. ఇతర ఆధారాలతో పోలీసులు గురుమూర్తిని అరెస్టు చేశారు.