Meerpet Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట్‌ మర్డర్‌ కేసులో తెలంగాణ పోలీసులు పైచేయి సాధించారు. హత్య జరిగి పది రోజులు దాటినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో నిందితుడిని అరెస్టు చేయలేకపోయారు. బ్లూరే టెక్నాలజీతో క్లూస్‌ పట్టుకున్న పోలీసులు... డీఎన్ఏ పరీక్షలు చేయించారు. మొత్తానికి ఈ కేసులో గురుమూర్తి నిందితుడిగా నిర్దారించుకునే సాక్ష్యాలు లభించడంతో అతన్ని అరెస్టు చేశారు. 


 మీర్‌పేట్ హత్య కేసు యావత్ దేశంలోనే ఓ కేస్‌స్టడీగా మిగిలిపోనుంది. పోలీసుల కేస్‌ హిస్టరీలో ఓ లెసన్ కానుంది. దీన్ని ఛేదించడానికి పోలీసులు తమ వద్ద ఉన్న అన్ని సాంకేతిక వ్యవస్థలను వాడుకోవాల్సి వచ్చింది. చివరకు బ్లూ రే టెక్నాలజీతో నిందితుడు గురుమూర్తికి చెక్ పెట్టారు. మొదట్లో మిస్సింగ్ కేసుగా చెప్పిన గురుమూర్తి కొన్ని గంటల్లోనే తనే హత్య చేసినట్టు అంగీకరించాడు. కానీ దమ్ముంటే సాక్ష్యాలు సేకరించండని పోలీసులకు సవాల్ చేశాడు.


హత్య చేసిన నిందితుడు తమ కళ్ల ఎదుటే ఉన్నప్పటికీ సాక్ష్యాలు లేకపోవడంతో మిస్సింగ్ కేసుగానే పోలీసులు దర్యాప్తు చేశారు. హత్య చేసినట్టు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులు ఆయన్ని అరెస్టు చేయలేకపోయారు. ఆ ప్రాంతంలోని సిసీటీవీ ఫుటేజ్‌ మరోసారి పరిశీలించారు. ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికీ వెళ్లలేదని నిర్దారించుకున్నారు. కానీ గురుమూర్తిని అరెస్టు చేసే సాక్ష్యాలు మాత్రం వారికి చిక్కలేదు. 


అనేక రకాల ప్రయత్నాలు చేశారు. గురుమూర్తి చెప్పి ప్రతి చోటా వెతికారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు. చివరకు బ్లూరే టెక్నాలజీతో ఇంట్లో తనిఖీలు చేపట్టారు. దీంతో బకెట్‌లో, మాంసం కొట్టిన దుంగపై కొన్ని బ్లడ్‌ శాంపిల్స్‌ లభించాయి. వాటిని ల్యాబ్‌లో టెస్టు చేయిస్తే అవి మనిషివేనని తేలింది. దీంతో పిల్లల నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు. 


ఇలా సేకరించిన శాంపిల్స్‌ను డీఎన్‌ఏకు టెస్టులకు పంపించారు. మూడు రోజుల ఉత్కంఠ తర్వాత ఆ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అవి మృతురాలు మాధవి బ్లడ్‌ శాంపిల్స్‌గా కన్ఫామ్‌ చేశారు. దీంతో గురుమూర్తే నిందుతుడిగా నిర్దారించుకున్న పోలీసులు అతన్ని ఇవాళ(28 జనవరి 2025) అరెస్టు చేశారు. అనంతరం  అతన్ని వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. 


అత్తవారింటి నుంచి అవమానాలు, వేరే మహిళతో తనకు ఉన్న సంబంధం, భార్యతో పదే పదే వివాదాల కారణంతో వెంకటమాధవిని హత్య చేశాడు గురుమూర్తి. సంక్రాంతి రోజున బంధవుల ఇంటికి వెళ్లి వచ్చాడు. అక్కడే పిల్లల్ని విడిచిపెట్టేశాడు. భార్యతో కలిసి మీర్‌పేట్ వచ్చాడు. మరోసారి భార్యభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో మాధవిని బలంగా నెట్టేశాడు. కిందపడిన ఆమె స్పాట్‌లోనే చనిపోయింది. దీంతో రెండు రోజులు ఆ డెడ్‌బాడీని మాయం చేసేందుకు వీడియోలు చూశాడు. చివరకు సూక్ష్మదర్శిని వెబ్‌సిరీస్‌లో చూపించినట్టు డెడ్‌బాడీని ఉడికించి డ్రైనేజీలో వేశాడు. మాంసం నరికే కత్తి, దుంగను తీసుకొచ్చి ముక్కలు చేశాడు. చివరకు ఆమె కనిపించడం లేదని అత్తమామలకు ఫోన్ చేశాడు. 


సాక్ష్యాలు మాయం చేశానన్న ధైర్యంతో తానే హత్య చేసినట్టు పోలీసులకు గురుమూర్తి చెప్పాడు. వారం పది రోజులుగా శ్రమించిన పోలీసులు ఎట్టేకలకు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి అరెస్టు చేశారు.