Cow Body Parts Thrown in Temple: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఆవుని చంపి ముక్కలుగా చేసి వాటిని ఆలయ ప్రాంగణంలో విసిరేశారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. సరిగ్గా బక్రీద్‌కి ముందే ఇది జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆలయంలోకి ఆవు అవశేషాల్ని విసిరేసినట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 14న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు వివరించారు. దీనిపై స్థానికుల్లో అలజడి రేగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మత విశ్వాసాలను దెబ్బ తీసినందుకు వాళ్లపై కేసులు నమోదు చేశారు. National Security Act (NSA) కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. నిందితులకు పలు చోట్ల అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించారు అధికారులు. ఆ మేరకు వాటిని కూల్చి వేశారు. ఈ ఘటనపై స్థానిక హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బంద్‌కి పిలుపునిచ్చాయి.
"రెండు బైక్‌లపై వచ్చి తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో ఆ ఆవు శరీర భాగాల్ని ఆలయంలోకి విసిరేశారు. ఇది గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు, మత విశ్వాసాలను దెబ్బ తీసినందుకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం"
- పోలీసులు
Also Read: J&K Terror Attacks: ఉగ్రవేటను తీవ్రతరం చేయండి, అందరినీ మట్టుబెట్టండి - అమిత్ షా ఆదేశాలు