Gun Fire At BSF Camp: బీఎస్ఎఫ్ క్యాంపులో ఓ జవాను కాల్పులు జరిపాడు. తోటి సిబ్బందిపై సీటీ సత్తెప్ప కాల్పులు జరపగా ఐదుగురు జవాన్లు చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డట్లు సమాచారం.
అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంపులో ఆదివారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో కాల్పులు జరిపిన జవాను సత్తెప్ప కూడా ఉన్నాడు. కాల్పులు జరిగిన ప్రాంతం అట్టారి-వాగా సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాల్పుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.