Ashutosh Mishras 11th PRC report: ఎట్ట‌కేల‌కు పీఆర్సీ నివేదిక రిలీజ్ అయ్యింది. ఎప్ప‌టి నుండో ఉద్యోగ సంఘాల‌న్నీ ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదికను ఏపీ స‌ర్కారు అర్ద‌రాత్రి సైలెంట్ గా రిలీజ్ చేసింది. ఇటీవ‌ల ఉద్యోగ సంఘాలు ఆందోళన నేప‌థ్యంలో పీఆర్సీ నివేదిక‌ను బ‌హిర్గ‌తం చేయ‌టం కూడా ఒక ప్ర‌దాన డిమాండ్ గా ప్ర‌భుత్వం  ముందు ఉంచారు. ఉద్యోగులతో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో పీఆర్సీ నివేదిక‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం నుండి హామి వ‌చ్చింది. దీంతో కాస్త ఆల‌స్యంగా అయినా పీఆర్సీ నివేదికను స‌ర్కార్ బ‌య‌ట‌పెట్టింది.


నివేదిక అమలుచేసినా రూ.3,181 కోట్ల భారమే
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలో అశుతోష్ మిశ్ర కమిటీ (Ashutosh Mishra Committee 11th PRC Report) చేసిన సిఫార్సులను అమ‌లు చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. మిశ్రా క‌మిటి యథాతథంగా అమలులోకి తెస్తే, ప్రభుత్వ ఖ‌జానా పై ఏడాదికి రూ.3,181 కోట్ల భారం ప‌డుతుంద‌ని క‌మిటి అభిప్రాయ‌ప‌డింది. ఉద్యోగుల‌కు 27% ఫిట్మెంట్ ఇస్తూ, ఇప్పుడున్న ఇంటి అద్దెను ఎమాత్రం తగ్గించకుండా, సీసీఏని కొనసాగించ‌టంతో పాటుగా, మ‌రి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ చేసిన సిఫారసుల్ని పూర్తిగా అమలు చేసిన‌ప్ప‌టికి, ఖ‌జానా పై పడే అదనపు ఆర్థిక భారం 3,181 కోట్లు అవుతుంద‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది.
ఇప్పటి వరకూ ఉన్న ఇంటి అద్దె భత్యాల్ని కొనసాగిస్తూ. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పని చేసే వారికి 22% హెచ్ ఆర్ఎ ఇవ్వాలంటూ కొత్త కేటగిరీని కూడ రిపోర్ట్ లో క‌మిటి సూచించింది. ఫిట్మెంట్, హెచ్ఎస్ఏ వంటివాటిని ఉద్యోగుల‌కు ఖ‌రారు చేసిన త‌రువాత క‌మిటి రిపోర్ట్ ను ప్ర‌భుత్వం తాపీగా వెబ్ సైట్ లో వెల్లడించింది.ఎపీ స‌ర్కారు అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయకుండా,ప్ర‌త్యామ్నాయంగా సీఎస్ ఆధ్వర్యంలో  కమిటీని నియ‌మించి, కమిటీ సిఫారసుల ఆధారంగా ఉద్యోగులకు ఫిట్మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించింది. హెచ్ఎస్ఏ కూడా త‌గ్గించారు.



  • కమిటీ నివేదికలోని మరికొన్ని అంశాలు.. 

  • కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి, గరిష్ట వేతనం రూ.1.79 లక్షలు ఉండాలి

  • హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు బేసిక్ మీద 30 శాతం, లేదా నెలకు రూ.26 వేలకు మించకూడదు

  • 10 లక్షల జనాభా నగరాల్లో ఉద్యోగులకు బేసిక్ మీద 22 శాతం, లేదా నెలకు రూ.22,500 వేలకు మించకూడదు

  • 2 నుంచి 10 లక్షల జనాభా నగరాల్లో ఉద్యోగులకు బేసిక్ మీద 20 శాతం, లేదా నెలకు రూ.20 వేలకు మించకూడదు

  • మిగతా ప్రాంతాల్లోని ఉద్యోగులకు బేసిక్ మీద 12 శాతం, లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఉండాలని సూచన

  • సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌ (CCA)లో రెండు శ్లాబులు సిఫార్సు. విజయవాడ, విశాఖపట్నంలలో పనిచేసే ఉద్యోగులకు ఒక రకమైన శ్లాబు
    మిగతా 12 నగరపాలక సంస్థల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు వేరే శ్లాబు ప్రతిపాదన

  • విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులకు రూ.400-1,000, ఇతర నగరపాలక సంస్థల్లో రూ.300 నుంచి రూ.750 మధ్య సీసీఏ చెల్లించాలని సిఫార్సు

  • రెగ్యూలర్ పోస్టులను కాంట్రాక్ట్ కింద భర్తీ చేయవద్దని సూచించారు. పదవీ విరమణ, ప్రమోషన్లతో జరిగే ఖాళీల వివరాలు ముందుగానే పొందుపరచాలి.
    తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పోస్టులను మాత్రమే కాంట్రాక్ట్ జాబ్స్‌గా భర్తీ చేయాలి

  • ప్రభుత్వం నుంచి నేరుగా పౌరులకు అందే సేవలను మీ-సేవ (Mee Seva Centres) ద్వారా అందజేయాలి.