CCTV footage petrol bomb Coimbatore : ఆ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమించలేదు. కానీ అలా ప్రేమిచంకపోవడాన్ని మరో విదంగా తీసుకున్నాడు. అదేదో శత్రువులు చంపేసుకోవాలన్నట్లుగా మారిపోయాడు. అమ్మాయి ఇంటిపై పెట్రోలు బాంబులేశాడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో జరిగిన ఈ సంఘటన నాగరిక సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, తన ఇష్టాన్ని నిరాకరించిందనే కక్షతో ఒక యువకుడు ఏకంగా పెట్రోల్ బాంబులతో యువతి ఇంటిపై దాడికి తెగబడ్డాడు.
తొండముత్తూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన యువతిని, చెన్నైకి చెందిన మారియప్పన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. వీరిద్దరికీ గతంలో కళాశాల రోజుల్లో పరిచయం ఏర్పడింది. అయితే, తన ఇష్టాన్ని ఆ యువతి ఖరాఖండిగా నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మారియప్పన్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై యువతి నివాసానికి చేరుకున్నాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబులను ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి ముఖద్వారంపైకి విసిరాడు. బాంబులు పేలిన ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
సిసిటివీలో దృశ్యాలు
నిందితుడు బాంబులు విసురుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. హెల్మెట్ ధరించి వచ్చిన మారియప్పన్, పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొండముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు మారియప్పన్ , అతనికి సహకరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇలాంటి ఘటనలు పెరిగిపోతూండటంతో విషయం రాజకీయం అవుతోంది. విజయ్ పగ్గాలు చేపట్టిన తరవాత పోలీసు వ్యవస్థలో సీరియస్ నెస్ తగ్గిపోయిందని.. నేరగాళ్లు రెచ్చిపోతున్నారన మండిపడుతున్నారు.
