Former Minister Narayana Arrest : పదో తరగతి పేపర్ల లీక్ ఏపీలో పెను సంచలనం అయింది. పేపర్ల లీక్ కేసులో మాజీమంత్రి నారాయణను మంగళవారం చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణ అరెస్టు వివరాలను చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామన్నారు. పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో ఆయనను అరెస్టు చేశామన్నారు. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తెలుసుకుని మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ప్రణాళిక ప్రకారమే నారాయణ విద్యాసంస్థలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాయని ఎస్పీ తెలిపారు. అటెండర్లు, సహాయ సిబ్బంది ద్వారా మాల్ ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. మిగతా విద్యాసంస్థల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పదో తరగతి పేపర్ల లీకేజి కేసులో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేస్తామన్నారు. గతంలోనూ ఇలా లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రిశాంత్‌రెడ్డి అన్నారు. లాంగ్వేజ్‌ల్లో ఎక్కువ మార్కుల కోసం ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. నారాయణ సతీమణిని అరెస్టు చేయలేదన్నారు. ప్రశ్నపత్రాల లీక్ లో చాలా మంది పాత్ర ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో అరెస్టు
మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు చిత్తూరుకు తరలించారు. మార్కుల కోసం మాల్ ప్రాక్టీస్ చేశారని ఎస్పీ తెలిపారు. ఇన్విజిలేటర్, వాటర్ బాయ్స్ ద్వారానే పేపర్ లీకేజ్ అయిందని ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పదో పరీక్షా ప్రశ్నాపత్రం లీకు కేసులో నారాయణను అరెస్ట్ చేశామన్నారు. ఆయన భార్యను అరెస్ట్ చేయలేదని ఎస్పీ చెప్పారు. ముందుగానే మాట్లాడి పెట్టుకుని పేపర్లను లీక్ చేశారని తెలిపారు. సమాధానాలు రాసి లోపలికి పంపే ప్రయత్నం జరిగిందని వెల్లడించారు. టెక్నినల్ ఎవిడెన్స్ దొరకడంతో నారాయణతో పాటు తిరుపతి డీన్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.
నారాయణ భార్యను అరెస్టు చేయలేదు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేయడం పక్క ఆధారాలతో జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్ తో నారాయణ పాత్ర ఉందని స్పష్టంగా తెలియడంతో అరెస్టు చేశామన్నారు. మిగిలిన విద్యాసంస్థలకు సంబంధించి వారి పాత్రను కూడా విచారిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆధారాలతో మంగళవారం ఉదయం నారాయణను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరికొద్ది సేపట్లో జడ్జి ముందు నారాయణను హాజరు పరుస్తామన్నారు. IPC సెక్షన్ 409, 408, 120, బి, 207 తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు నిర్ధారణ అయితే నిందితునికి పది సంవత్సరాల పాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉందన్నారు. ఈ కేసులో నారాయణ భార్యను అరెస్టు చేసినట్లు వస్తున్న వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని స్పష్టం చేశారు.