చిత్తూరు జిల్లా(Chittoor District)  బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు‌ ప్రమాదం(Road Accident) జరిగింది. బోలేరో వాహనానికి బ్రేక్‌ ఫేయిల్‌ అవ్వడంతో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో బొలేరో(Bolero)లో‌ ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి మరణించారు. పలువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో మదనపల్లె(Madanapalle) ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించారు. క్షతగాత్రులు పెనుమూరు మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.


ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెదురుకుప్పం(Veduru Kuppam), పెనుమూరు మండలాలకు  చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.  ముదివేడు ఎస్ఐ(SI)సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రాణి, రేణుకా, రఘునాథ రెడ్డి, శామలమ్మ, మునిలక్ష్మీ, కల్పన, రాజ్యలక్ష్మి, నిర్మలా, శోభ, సుబ్బిరెడ్డి, సుజాతలు గాయపడ్డారు. బోలోరో వాహనం డ్రైవర్ మణి, ఝాన్సీ, నందినిలు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మదనపల్లె ఆర్డీఓ మురళీ మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా(Tirupati Ruya) ఆసుపత్రికి తరలిస్తున్నారు. 


అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయలయ్యాయి. మృతులు బాగాదమ్మ, దళపతి, ఈశ్వర్ అని పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి పులగంపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మినీ బస్సులో 25 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కదిరిలో 10 మంది సభ్యులు దిగిపోయారు. మరో 15 మందితో సొంత ఊరు పులగంపల్లి వెళ్తుండగా గ్రామ సమీపంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపటికి ఇంటికి చేరుకుంటారనుకునే సమయంలో ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వ్యాన్ బోల్తా పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.