చిత్తూరు జిల్లా పుత్తూరులో విషాదం నెలకొంది. పెద్ద కొడుకు చేసిన అప్పు ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. చిత్తూరు జిల్లా రాచపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకరయ్య(55), గురువమ్మ(45) దంపతుల పెద్ద కుమారుడు సతీష్‌. అతడు తనకు తెలిసిన వ్యక్తుల వద్ద రూ.కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చిదారిలేక, పదే పదే అప్పులు వాళ్లు ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడంతో సతీష్‌ ఇంటి నుంచి పారిపోయాడు.


Also Read: Khammam: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి నీచపు పని.. ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం


కేసు నమోదు


సతీష్ ఇంటి నుంచి పారిపోవడంతో మనస్థాపానికి గురైన తల్లిదండ్రులు శంకరయ్య, గురవమ్మ, చిన్న కుమారుడు వినయ్‌(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారంలో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అవమానం తట్టుకోలేక


కోటిన్నర అప్పు కుటుంబాన్ని కబలించింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.  అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు రూ. కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులు అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడు. తల్లి, తండ్రి, మరో కుమారుడిని అప్పు తీర్చాలని కొందరు పరుష పదజాలంతో దూషించినట్లు స్థానికులు అంటున్నారు. ఆ అవమానం తట్టుకోలేక తలకు మించిన అప్పు తీర్చలేని స్థితి ఆ ముగ్గురిని మానసికంగా కుంగదీసింది. తమకు చావే శరణ్యం అనుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కుమారుడి ఆచూకీ ఇంకా తెలియలేదని స్థానికులు అంటున్నారు. 


Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం


బ్యాంక్ ఆఫ్ బరోడాలో సొమ్ము స్వాహా!


చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కొన్ని ఖాతాల నుంచి సుమారు రూ.3 కోట్లు మాయమయ్యాయని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బుధవారం రూ.50 లక్షల ఖాతాదారుల సొమ్ము మాయమైందని ప్రచారం జరగ్గా సాయంత్రానికి రూ. 3 కోట్లకు పైబడింది. మండలంలోని మహిళా సంఘాలకు చెందిన ఖాతాల నుంచి సొమ్ము స్వాహా అయినట్లు వెలుగుచూసింది. వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తెలుస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తాలే గల్లంతు కావడంతో ఉద్యోగులు తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతా ఉన్న మేడికుర్తి పంచాయతీ మజ్జిగవాండ్లపల్లెకు చెందిన గణపతి ఎస్‌హెచ్‌జీ గ్రూపులో రూ.1,33,800 సొమ్ము దారి మళ్లినట్లు కలికిరి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బందే ఈ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని వెలుగు అధికారులు పేర్కొన్నారు. 


Also Read: Rahul Murder Case: రాహుల్ హత్య కేసులో పది మంది పాత్ర ... కీలక దశలో విచారణ... సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్న పోలీసులు