BR Ambedkar Konsaseema District | తల్లితండ్రులు పిల్లల్ని చిన్నమాట అంటే కూడా పడని విధంగా ప్రస్తుత కాలంలో మనం ఉన్నామనిపిస్తుంది.. వారి జీవితాలు బాగుపడతాయనే తల్లితండ్రులు మంచి చెడులు చెపుతారు.. లేదా చేయి చేసుకుంటారు.. అంత మాత్రాన వారికి పిల్లలపై ప్రేమ లేదనా... అయితే ఇప్పడు ఇలానే తెలిసీ తెలియని వయస్సులో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. బడికి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో ఆరుగురు విద్యార్థలు ఇళ్లు వదిలి పారిపోయారు.. ఈసంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు ఖండ్రికపేటలో చోటుచేసుకుంది. అయితే అయిదుగురు విద్యార్థుల అదృశ్యం వెనుక కారణమిదే అని స్థానికంగా అనుకుంటున్నా ఐదు రోజులైనా వారి ఆచూకీ ఎక్కడా దొరకక పోవడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి.. ఆరుగురు పిల్లల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
అదృశ్యమైన వారిలో ఇద్దరు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. వీరంతా 6, 7, 8 తరగతులు చదువుతున్నారు. అలాగే వీరంతా ఒకే సమాజిక వర్గంకు చెందిన సమీప బంధువులు కూడా. అందువల్ల ఏదో బంధువులు ఇంటికి వెళ్లి ఉంటారని వీరు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ దొరకక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
అదృశ్యమైన పిల్లలంతా ఒకే ప్రాంతానికి చెందిన వారే.. రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 24 రాత్రి 7 గంటల సమయంలో వీరు ఆరుగురు ఇంటి నుంచి వెళ్లారు. అదృశ్యమైన వారిలో ఎనిమిదవ తరగతి చదువుచున్న కొమరగిరి కరుణ(14),గంధం సత్యనారాయణ(13),ఏడవ తరగతి చదువుచున్న మర్రి సంతోష్(14),కొమరగిరి మాధురి(12),ఆరవ తరగతి చదువుచున్న కొమరిగి పుద్వీ వర్మ(12),కొమరగిరి పండు(12)లు ఉన్నారు.వీరిలో కరుణ, పృథ్వి వర్మ అక్క తమ్ముళ్లు. అలాగే కరుణ ఆలమూరు బొబ్బా జయశ్రీ జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతుంది.మిగిలిన నలుగురు బాలురులు కొత్తూరు సెంటర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువున్నారు.మాధురి మాత్రం రామచంద్రాపురంలో చదువుతుంది.ఆ అమ్మాయి ఉండేది రామచంద్రాపురమే.అయితే కరుణ,పృధ్వీ వర్మ లకు మాధురి పెద్దమ్మ కుమార్తె. వీళ్ల ఇంటికి ఆలమూరు వచ్చిన ఈ అమ్మాయి మిగిలిన అయిదుగురుతో కలిసి వెళ్లిపోయింది.
నేటికీ లభించని పిల్లల ఆచూకీ..
ఆలమూరు గ్రామంలో ఒకేసారి ఆరుగురు విద్యార్థులు అదృశ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్పటివరకు తమ కళ్లముందు కనిపించిన పిల్లలంతా ఒక్కసారిగా అదృశ్యం అవ్వడంతో తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చేందారు.. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి ఆచూకీ కోసం అన్ని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అలాగే మీడియా, సోషల్ మీడియాకు సమాచారం తెలిపారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు పారితోషికం కూడా పోలీసు అధికారులు ప్రకటించారు. వీరి సమాచారం తెలిసినవారు ఆలమూరు పోలీస్ స్టేషన్ 9440904849 లేదా రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం 9440796527, కొత్తపేట డిఎస్పి 8712692109 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం..
ఆరుగురు చిన్నారులు అదృశ్యం అయిన నేపథ్యంలో పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.. అయితే వారి ప్రాధమిక విచారణలో పి.గన్నవరం మండలం మీదుగా రాజోలు వైపుగా వెళ్లినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చి గాలిస్తున్నారు.. అక్కడ ఉన్న బంధువులుకు సమాచారం అందించారు. అయితే ఇంకా చిన్నారుల ఆచూకీ లభించకపోవడంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు..