Chicago Gunfire: 8 shot dead, 16 injured: Chicago Shootings: అమెరికా మరోసారి  తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. వీకెండ్ కావడంతో పార్టీలకు హాజరైన వారిపై చికాగోలో ఒక్కసారిగా పలు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా, పోలీసులు వెల్లడించారు.


శుక్రవారం సాయంత్రం మొదలై.. 
మొదట శుక్రవారం సాయంత్రం ఎన్​బీసీ చికాగోలోని సౌత్​ కిల్పట్రిక్ ఏరియాలో కాల్పులు మొదలయ్యాయి. ఇక్కడ జరిగిన గన్ ఫైర్‌లో  ఓ 69 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. శుక్రవారం సాయంత్రం 5:45కు గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపాడు. ఓవరాల్‌గా చికాగోలోని  బ్రిఘ్​టన్​ పార్క్​, సౌత్​​ ఇండియానా, నార్త్​ కెడ్జీ అవెన్యూ, హంబొల్డ్​ పార్క్​ సహా మరికొన్ని ప్రాంతాల్లో గుర్తుతెలియని దుండుగులు కాల్పుల (weekend shootings in Chicago)కు పాల్పడ్డారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది. ఈ కాల్పుల్లో అన్ని వయసుల వారు గాయపడ్డారు.


ఇప్పటివరకూ 140 కాల్పుల ఘటనలు 
చనిపోయిన వారిలో చిన్నారులు, మద్య వయసు వారితో పాటు 69 ఏళ్ల వృద్ధుడు, 62 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. నగరంలో వీకెండ్‌లో పలు చోట్ల జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోగా, మరో 42 మంది వరకు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా హింస మరింతగా పెరిగిపోతోందని గతంలోనూ పలు నివేదికలలోనూ పేర్కొన్నారు. 2022 ఏడాదిలోనే ఈ నాలుగు నెలల్లో అమెరికాలో 140 వరకు తుపాకీ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 


గన్ వాయ్‌లెన్స్ ఆర్కీవ్ రీసెర్చ్ గ్రూప్ మొత్తం 7500 సోర్సెస్ నుంచి వివరాలు సేకరించి రిపోర్ట్ తయారుచేసింది. జో బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన హింసాత్మక ఘటనలపై ఆ రీసెర్చ్ గ్రూప్ గుర్తించిన విషయాలను నివేదిక రూపంలో బహిర్గతం చేసింది. గతంలో మాదిరగా తుపాకులను ఒకేచోట కొనుగోలు చేయడం లేదని, విడి భాగాలను తీసుకుని వాటిని తుపాకులుగా మార్చుతున్నారని రీసెర్చర్లు తెలిపారు. బైడెన్ ప్రభుత్వం గన్ కల్చర్, దాని తీవ్ర పరిణామాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై యోచిస్తోంది. 


Also Read: Banjara Hills Land Issue : బంజారాహిల్స్ భూ వివాదంలో ట్విస్ట్, నిందితులకు బెయిల్, పోలీసులకు మెమోలు


Also Read: Repalle Rape Case: రేపల్లెలో అత్యాచార కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు, టైమ్ అడిగి గొడవ, ఆపై మహిళపై అఘాయిత్యం