మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) సీబీఐ అధికారులు కొంత విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించారు.  పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో యుసిఐల్ ఉద్యోగి ఉదయ్ కూమార్ రెడ్డిని ( Uday Kumar Reddy ) ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడుగాచెబుతున్నారు. నిజానికి ఉదయ్ కుమార్ రెడ్డిని గత ఏడాది సెప్టెంబర్‌లోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. పలుమార్లు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు.  ఉదయ్ కుమార్ రెడ్డి ఫోన్‌ను కూడా స్వాధీనంచేసుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు దస్తగిరి ( Dastagiri ) అప్రూవర్‌గా మారిన తర్వాత  రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మరోసారి ఉదయ్ కుమార్ రెడ్డిని పిలిపించి ప్రశ్నించడం సంచలనంగా మారింది. 


ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నా నోరెత్తరా ? సీఎం జగన్‌ తీరుపై పెరుగుతున్న విమర్శలు !


ఇటీవల సీబీఐ ( CBI ) అధికారులు విచారణ జరపడం లేదు.  దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ( Devireddy Sivasankar Reddy ) అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ అధికారులపై ఒత్తిడి పెరిగింది. సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతరులను ఇరికించేలా వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వివేకా పీఏ కృష్ణారెడ్డి ( PA Krishna Reddy ) కూడా అదే ఆరోపణలతో కడప ఎస్పీని కలిశారు. మరో వైపు  వివేకాహత్య కేసులో  ఆయన కుమార్తె, అల్లుడిపైనే కొంత మంది ఆరోపణలు చేస్తూ వరుసగా తెరముందుకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణ నిలుపుదల చేసింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ కోసం కొంత మంది హైకోర్టుకు వెళ్లడం...క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం వంటివి జరిగాయి. 


మార్చి 3న వారణాశిలో పీపుల్స్ ఫ్రంట్ ఆవిర్భావం ? మెగా ర్యాలీ ప్లాన్ చేస్తున్న మమతా బెనర్జీ !


ఇప్పుడు సీబీఐ మరోసారి రంగంలోకి దిగింది.  ఇప్పటి వరకూ లభించిన ఆధారాలు.. అప్రూవర్‌గా మారి దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ అధికారులు మరింత దూకుడుగా విచారణ జరిపే  అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివేకా హత్య కేసు విచారణపై మొదటి నుంచి రాజకీయం జరుగుతూనే ఉంది. సీబీఐ ఎంత త్వరగా కేసును చేధిస్తే అంత త్వరగా ఈ అంశం చుట్టూ రాజకీయం  చెదిరిపోయే అవకాశం ఉంది.  ఈ కేసులో నిందితులంతా బయటపడితే రాజకీయ పరిణామాలు కూడా మారిపోతాయన్న ప్రచారం  ఉంది. అందుకే ఈ కేసుపై ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది.