Kolkata Doctor Death Case: ఆర్‌జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కి సీబీఐ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌తో పాటు మొత్తం ఆరుగురికి ఇదే టెస్ట్ చేసింది. ఇందులో భాగంగా సందీప్ ఘోష్‌ని లోతుగా విచారించింది. ఇప్పటికే దాదాపు 100 గంటల పాటు విచారణ చేపట్టినప్పటికీ అతని నుంచి సరైన సమాధానాలు రాలేదు. అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌లో పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టినట్టు సమాచారం. ఈ టెస్ట్‌లో ముందుగా సందీప్ ఘోష్‌ని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగిన అధికారులు ఆ తరవాత ఈ కేసుకి సంబంధించిన వివరాలు అడిగారు. ఈ టెస్ట్‌లో భాగంగా సందీప్ ఘోష్‌ని మొత్తం 25 ప్రశ్నలు అడిగినట్టు ABP న్యూస్ సోర్సెస్ ద్వారా తెలిసింది.  ఈ రిపోర్ట్ ప్రకారం..అడిగిన ప్రశ్నలివే. 


1. మీ పేరు సందీప్ ఘోష్..నిజమేనా..?
2. మీరు కోల్‌కతాలోనే జన్మించారా..?
3. ఈ ఘటన జరిగినప్పుడు మీరు హాస్పిటల్‌లోనే ఉన్నారా? 
4. ఇవాళ శనివారమేనా..?
5. హత్యాచారానికి పాల్పడిన నిందితుడితో మీకు పరిచయముందా..?
6. మీరెప్పుడైనా అబద్ధం చెప్పారా? 
7. డాక్టర్‌ని ఎవరు చంపారో తెలుసా? 
8. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందని మీరనుకుంటున్నారా?
9. ఈ ఘటన గురించి మీరు పోలీసులకు ఏమైనా సమాచారం అందించారా?
10. ఈ ఘటన జరగక ముందు డాక్టర్‌ని మీరేమైనా కలిశారా, మాట్లాడారా?
11. మీకు డాక్టర్‌కి మధ్య మనస్పర్దలున్నాయా?
12. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు మీరు చెప్పారా?
13. ఈ ఘటన గురించి పోలీసులకు ఆలస్యంగా చెప్పారా?
14. ఒకవేళ ఆలస్యమైతే ఎందుకు జరిగిందో చెప్పండి?
15. మీరు డాక్టర్ కదా. క్రైమ్ సీన్‌ని సేఫ్‌గా ఉంచాలని మీకు తెలియదా?
16. క్రైమ్‌ సీన్‌లో మరమ్మతులు చేయమని మీరే చెప్పారా?
17. మీకు మీరుగా ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఎవరైనా చెబితే మరమ్మతులు చేయించారా?
18. ఎవరు చెబితే మీరు బాధితురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించారు?
19. సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేయడం నేరం అని మీకు తెలియదా? 
20. విచారణ పూర్తయ్యేంత క్రైమ్‌ సీన్‌ని సురక్షితంగా ఉంచాలని తెలియదా? మీరా పని ఎందుకు చేయలేదు? 
21. ఘటన జరిగిన వెంటనే మీరెందుకు రాజీనామా చేశారు? అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది?
22. రిజైన్ చేయాలని మీపైన ఎవరైనా ఒత్తిడి చేశారా?
23. ఈ ఘటన జరిగిన తరవాత మీరెవరితో మాట్లాడారు? ఫోన్‌లో ఎవరికి ముందుగా ఇన్‌ఫామ్ చేశారు?
24. అన్ని ప్రశ్నలకీ మీరు సరైన సమాధానమే చెప్పానని అనుకుంటున్నారా? 
25. ఈ రంగేమిటో చెప్పండి? 


ఇలా దాదాపు పాతిక ప్రశ్నలు అడిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే...వీటికి సందీప్ ఘోష్ ఎలా సమాధానమిచ్చాడు..? ఈ రిజల్ట్ సంగతేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. సందీప్ ఘోష్‌తో పాటు నిందితుడు సంజయ్ రాయ్‌నీ ఇదే విధంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో హాస్పిటల్‌ సిబ్బంది, నిందితుడు చెబుతున్న వివరాలను పోల్చుకుని ఆ తరవాతే ఓ నిర్ణయానికి రావాలని సీబీఐ భావిస్తోంది. వీరిలో ఎవరైనా సాక్ష్యాలను నిర్వీర్యం చేయాలని చూశారా అన్న కోణంలో విచారణ జరుపుతోంది. 


Also Read: Kolkata: నేనే నేరం చేయలేదు, అమాయకుడిని - కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా కేసు నిందితుడు