Newly married commits suicide in Hyderabad | హైదరాబాద్: భాగ్యనగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగిన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాలానగర్ లోని బాల్ రెడ్డి నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన విజయగౌరి (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఫిబ్రవరి 6వ తేదీన ఈశ్వరరావుతో ఘనంగా వివాహం జరిపించారు. అంతలోనే ఏం జరిగిందో కానీ, పెళ్లి చేసుకున్న సరిగ్గా నెల రోజులకు విజయగౌరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ లోని బాల్ రెడ్డి నగర్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. నవ వధువు మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగా బలవన్మరణం చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.