Brutal murder took place in Medchal: మనుషుల ప్రాణాలు తీయడం ఇప్పుడు చాలా సింపుల్ సింపుల్ అయిపోయింది. ఇలా వచ్చి అలా చంపేసి వెళ్లిపోతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో భయానక హత్య జరిగింది. గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన దుండగులు విచక్షణ రహితంగా నరికి చంపేశారు. చనిపోయిన వ్యక్తిని ముషీరాబాద్ కు చెందిన మహబూబ్ (35)గా గుర్తించారు. హత్యకు గురైన మహబూబ్ కూడా కరుడు గట్టిన నేరస్తుడు. అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులకు నమోదు అయ్యాయి. పాత కక్షల కారణంగా హత్య చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు .. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. హత్యకేసు కు సంబంధించి వివరాలను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ముషీరాబాద్ కు చెందిన రౌడీషీటర్ ఏం. డి మహబూబ్ (35)ను ముగ్గురు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారని తమకు సమాచారం అందిందని అన్నారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాలని తెలిపారు.
ఎండి మహబూబ్ గతo లో రౌడీ షీటర్ అని అతని వివిధ పోలీస్ స్టేషన్ లో 13 కేసులు ఉన్నాయని అందులో ఎక్కువగా దొంగతనం కేసులతోపాటు పఠాన్ చెరువు లో హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని డిసిపి తెలిపారు.