Youth dies after jumps from Gautami Godavari bridge: 
- గౌతమి గోదావరి బ్రిడ్జ్ పై నుంచి దూకిన యువకుడు
- జాలర్ల సహాయంతో ఒడ్డుకు చేర్చిన పోలీసులు
- యువకుడికి ప్రథమ చికిత్స చేసిన హైవే సిబ్బంది
- కొత్తపేట తరలిస్తుండగా యువకుడు మృతి
- డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘటన


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గౌతమి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని పోలీసులు, జాలర్లు చెబుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి..


అసలేం జరిగిందంటే..
కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం  గౌతమి బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి ఓ యువకుడు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. జాలర్ల సహాయంతో రావులపాలెం ఎస్సైలు రమణ, సురేంద్ర, హైవే పెట్రోలింగ్ పోలీసులు విఏబి స్వామి, సిహెచ్ రామ్మోహనరావు, హైవే సిబ్బంది వెళ్లి సుమారు అరగంట పాటు శ్రమించి ఒడ్డుకు చేర్చారు. 


హైవే అంబులెన్స్ సిబ్బంది యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణాలు కాపాడేందుకు వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం హైవే అంబులెన్స్ పై కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు యువకుడు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన యువకుడి చేతి పై నాగు అనే పేరు, తెలు బొమ్మ పచ్చ బొట్లు ఉన్నాయి. యువకుడు నలుపు రంగు ఫర్ట్, బ్లూ జీన్స్ పాయింట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.  మృతుని ఆచూకీ తెలిసిన వారు రావులపాలెం పోలీస్ లకు సమాచారం అందించాలని రావులపాలెం ఎస్. ఐ రమణ కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


భార్య డ్యూటీ చేసే బస్సే భర్త ప్రాణాలు తీసింది
ఆమె ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగి. రోజూ ఆమెను బైక్ పై బస్ డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి తీసుకెళ్తాడు. రోజూలాగే ఈరోజు కూడా భార్యని బైక్ పై గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. ఆమెను లోపలికి పంపించి బైక్ పై బయటకు వచ్చాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. చక్రాలకింద నలిగిపోయి భర్త ప్రాణాలు వదిలాడు. భర్త శవంపై పడి భార్య రోదిస్తున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.


నెల్లూరు జిల్లా కావలికి చెందిన సుభాషిణి, సుబ్బారాయుడు దంపతులు. సుభాషిణి కావలి డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ సుభాషిణిని తీసుకొచ్చి డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తుంటాడు సుబ్బారాయుడు. ఈరోజు ఉదయం డ్యూటీ కావడంతో గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. గ్యారేజ్ నుంచి అన్ని బస్సులు బయలుదేరే సమయం అది. సుభాషిణి కూడా డ్యూటీకోసం గ్యారేజీలోకి వెళ్లింది. ఆమెను వదిలిపెట్టిన అనంతరం సుబ్బారాయుడు తిరిగి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఎంతో సమయం పట్టలేదు. కేవలం సెకన్ల వ్యవధిలోనే అతను బస్సుకింద పడి చనిపోయాడు. డ్యూటీకి వెళ్లేందుకు లోపలికి వెళ్తున్న సుభాషిణి.. బయట జరిగిన హడావిడి చూసి పరుగు పరుగున వచ్చింది. బయట రక్తపు మడుగులో పడిన భర్తని చూసి షాక్ అయింది. అయితే అప్పటికే సుబ్బారాయుడు ప్రాణాలు వదిలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. బస్సు చక్రాలకింద బైక్ తో సహా నలిగిపోయి ప్రాణాలు వదిలాడు సుబ్బారాయుడు.