Hyderabad Road Accident: హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఓ బీఎండబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని బలంగా ఢీకొట్టింది. సమయానికి బీఎండబ్ల్యూ కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే కారు డ్రైవర్, అందులోని  వ్యక్తులు బీఎండబ్ల్యూ వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. 


డ్రైవర్‌ మద్యం మత్తే కారణమా?
TS09 FY 9990 నెంబర్ ప్లేట్ ఉన్న బీఎండబ్ల్యూ కారు చెక్ పోస్టు వద్ద బీభత్సం సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా బీఎండబ్ల్యూ ఓనరును సంప్రదించే పనిలో పోలీసులు ఉన్నారు. మాలిక్‌ జెమ్స్‌ అండ్‌ జ్యవెలరీ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. 






బీఎండబ్ల్యూ కారుపై ఇదివరకే 2  పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు, మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ సేకరించి, అసలేం జరిగిందా అని వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


Also Read: Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు