Pranai Case : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీ రావు కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని మారుతీరావు 2018 సెప్టెంబర్‌లో సుపారీ గ్యాంగ్ సహాయంతో ప్రణయ్‌ను అత్యంత దారుణంగా హత్య చేయించాడు.  గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వస్తుండగా ప్రణయ్ ను దుండగులు ఆసుపత్రి ఆవరణలోనే కత్తితో నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మారుతీరావు, అతనికి సుపారీ గ్యాంగ్ అందించిన రౌడీ షీటర్ అబ్దుల్ బారి సహా నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తరువాత బెయిల్ పై విడుదలైన మారుతీరావు 2020 మార్చిలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.


Also Read: తీవ్ర పని ఒత్తిడి - భవనం పై నుంచి దూకి బ్యాంకు మహిళా ఉద్యోగి ఆత్మహత్య, బాచుపల్లిలో తీవ్ర విషాదం


ఇది ఇలా ఉంటే  ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభాష్ బెయిల్ కోసం నకిలీ షూరిటీలను సమర్పించాడని పోలీసులు గుర్తించారు. దీంతో మిర్యాలగూడ పోలీసులు నకిలీ షూరిటీలను సమర్పించిన ముగ్గురిని అరెస్టు చేసి అరెస్టు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ సంచలనం సృష్టించింది.  కూతురు పెళ్లి నచ్చని మారుతీరావు సుపారీ గ్యాంగ్ సహాయంతో ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అతను బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన సుభాష్, అమృత తండ్రి మారుతిరావు,  మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత, మారుతిరావు,  ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత మారుతిరావు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు.


Also Read: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక