Big Twist in Bengaluru ATM Cash Heist : బెంగళూరులో గురువారం జరిగిన రూ. 7.11 కోట్ల ఏటీఎం క్యాష్ వ్యాన్ దోపిడీ కేసులో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసు కానిస్టేబుల్‌తో పాటు మరో మాజీ CMS ఇన్ఫో సిస్టమ్స్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు దోపిడి నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించారని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు.
నవంబర్ 19 బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు జేపీ నగర్‌లోని HDFC బ్యాంక్ బ్రాంచ్ నుంచి CMS ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్‌కు చెందిన క్యాష్ వ్యాన్‌లో రూ. 7.11 కోట్లు ఏటీఎమ్ రీఫిల్ కోసం తీసుకుని బయలుదేరింది. కొద్ది దూరంలోనే ఆ వ్యాన్‌కు అడ్డంగా ఇన్నోవా వచ్చింది. సినీ ఫక్కీలో అందులో నుంచి 7-8 మంది అంటే గ్యాంగ్ సభ్యులు RBI, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులుగా నటించి.. "పెద్ద మొత్తంలో క్యాష్ తీసుకువెళ్తున్నారు, డాక్యుమెంట్లు వెరిఫై చేయాలి" అని డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, కస్టోడియన్‌లను బెదిరించారు.
బలవంతంగా గ్యాంగ్ సభ్యులు వ్యాన్‌లోకి వెళ్లి డ్రైవర్‌తో వాహనాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. నిర్మానుష్యమైన ఏరియాకు తీసుకెళ్లింది అక్కడ క్యాష్ బాక్సులు, DVR కెమెరాను తీసుకుని, సిబ్బందిని దూరంగా వదిలేసి పారిపోయారు. దాదాపు 45 నిమిషాల తర్వాత మేనేజర్‌కు సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
నవంబర్ 21 తెల్లవారుజామున గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ను నైట్ షిఫ్ట్ తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేశారు. అతనితో పాటు CMS ఇన్ఫో సిస్టమ్స్‌లో పనిచేసి ఇటీవల మానేసిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ ఇద్దరూ చివరి 6 నెలలుగా స్నేహితులుగా ఉండి, దీర్ఘకాలం ప్లాన్ చేసి ఈ దోపిడీని చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్ డీటెయిల్ రికార్డ్స్ (CDR) వెరిఫికేషన్‌లో, దోపిడీ సమయంలో , ముందు రోజుల్లో ఈ ఇద్దరి మధ్య అనేక కాల్స్ బయటపడ్డాయి. దోపిడీ స్థలం సమీపంలో యాక్టివ్ మొబైల్ నంబర్లు ట్రాక్ చేసినప్పుడు ఈ లింక్ వెలుగులోకి వచ్చింది. అదనంగా, మరో మారుతి జెన్ కారు కూడా ఇన్వాల్వ్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దోపిడీ తర్వాత వెంటనే బోర్డర్ చెక్ పాయింట్లు, రోడ్ బ్లాక్‌లు ఏర్పాటు చేసినా, గ్యాంగ్ తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లో దాక్కుంటున్నట్టు అన్వేషణలో తెలుస్తోంది. ఫేక్ నంబర్ ప్లేట్‌తో ఇన్నోవాకారును ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ జిల్లా తిరుపతి సమీపంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. పోలీసులు 8 స్పెషల్ టీమ్‌లు, 200 మంది అధికారులతో కలిసి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దోపిడీ బెంగళూరు చరిత్రలో అతిపెద్ద దోపిడీలలో ఒకటిగా నిలిచింది.