Honda Upcoming Cars 2026: హోండా, భారత మార్కెట్‌పై మళ్లీ ఫోకస్‌ పెంచింది. 2030 నాటికి 10 కొత్త కార్లు ఇండియాలో లాంచ్‌ చేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అందులో తొలి దశగా, 2026 నుంచి 2028 మధ్య నాలుగు ముఖ్యమైన గ్లోబల్‌ మోడల్స్‌ను భారత రోడ్లపైకి తీసుకురానుంది. 

Continues below advertisement

ZR-V - 2026లో హోండా తొలి గ్లోబల్‌ ఎంట్రీ

హోండా ZR-V ఒక కంపాక్ట్‌ SUV. ఇది ప్రపంచవ్యాప్తంగా HR-V & CR-V మధ్య పొజిషన్‌ అయ్యే మోడల్‌. ఇది, 181 hp శక్తిని ఇచ్చే 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఆధారిత హైబ్రిడ్‌ సిస్టమ్‌తో ఇండియాలోకి రావొచ్చు. ఈ SUV 0-100 km/h వేగాన్ని కేవలం 7.8 సెకన్లలో చేరుతుంది. టాప్‌ స్పీడ్‌ 173 km/h. WLTC ప్రకారం మైలేజ్‌ లీటరుకు 22.1 km. భారత మార్కెట్లో మిడ్‌-సైజ్‌ SUV సెగ్మెంట్‌లో ఇది బలమైన పోటీదారుగా మారే అవకాశం ఉంది.

Continues below advertisement

Honda Prelude - 2026లో మళ్లీ స్పోర్ట్స్‌ కార్ల యుగం

జపాన్‌లో తాజాగా సేల్‌కు వచ్చిన స్పోర్ట్స్‌ కూపే Honda Prelude... 2026లో భారత్‌లో కూడా లాంచ్‌ అవుతుంది. ఇది 2+2 సీటింగ్‌తో వస్తుంది. అయితే రియర్‌ సీట్‌ సైజ్‌ చిన్న పిల్లలకు మాత్రమే సరిపోతుంది. ZR-V తరహాలోనే ఇది కూడా 181 hp హైబ్రిడ్‌ పవర్‌ట్రైన్‌తోనే వస్తుంది. 0-100 km/h వేగానికి 8.2 సెకన్లు పట్టినా, టాప్‌ స్పీడ్‌ మాత్రం 188 km/h. కూపే బాడీ వల్ల 23.6 km/l మైలేజ్‌ రావడం స్పెషల్‌ అట్రాక్షన్‌.

Honda 0 Alpha - 2027లో హోండా తొలి ఎలక్ట్రిక్‌ SUV

హోండా కంపెనీ '0 Alpha' తొలి ఇండియన్‌ EV. 2027 ప్రారంభంలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ SUV హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, మారుతి e-విటారా సెగ్మెంట్‌లో ఉండొచ్చు, కానీ ధర మాత్రం వాటి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 0 Alpha EVను ఇండియాలోనే మాన్యుఫాక్చర్‌ చేయాలని హోండా ప్లాన్‌ చేస్తోంది. EV మార్కెట్లో హోండా సీరియస్‌గా ప్రవేశించబోతుందనేందుకు ఇది సంకేతం.

Honda 0 SUV - టెస్లా Model Y కి డైరెక్ట్‌ ఛాలెంజ్‌

Honda 0 SUV భారత మార్కెట్లో నిష్‌ & బ్రాండ్‌ బిల్డింగ్‌ మోడల్‌గా రానుంది. దీనిని ఇండియాలోకి అమెరికా నుంచి CBU (కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌) గా దిగుమతి చేస్తారు. ఈ SUV టెస్లా Model Y క్లాస్‌లో తయారైంది. ప్రీమియం EV సెగ్మెంట్‌లో హోండా శక్తిని చూపించే ప్రత్యేక మోడల్‌ కానుంది.

2028లో నెక్ట్స్‌-జెన్‌ హోండా సిటీ

2028 మొదటి భాగంలో కొత్త తరం Honda City భారత్‌లో లాంచ్‌ అవుతుంది. పెట్రోల్‌ & హైబ్రిడ్‌ రెండు వేరియంట్లు రానున్నాయి. ఈసారి హైబ్రిడ్‌ సిస్టమ్‌ను ఎక్కువగా ఇండియాలోనే లోకలైజ్‌ చేస్తారు. ధరలు కూడా కాంపిటిటివ్‌గా ఉండొచ్చు.

2029లో నెక్ట్స్‌-జెన్‌ హోండా CR-V

హోండా CR-V కొత్త తరం మోడల్‌ 2029 నాటికి భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి CR-V హైబ్రిడ్‌ పవర్‌ట్రైన్‌తోనే వస్తుంది. ఈ కంపెనీ జపాన్‌ నుంచి CKD కిట్స్‌ను తెప్పించి రాజస్థాన్‌ ప్లాంట్‌లో అసెంబుల్‌ చేయవచ్చు. ప్రస్తుతం హోండా ప్రీమియం SUV మార్కెట్లో ఉన్న గ్యాప్‌ను ఈ CR-V పూరించనుంది.

హోండా ఇండియా, వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో భారీ లాంచ్‌లకు బలంగా సిద్ధమవుతోంది. హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, స్పోర్ట్స్‌ - ఈ మూడు సెగ్మెంట్లలోనూ ఈ కంపెనీ తన కొత్త శక్తిని చూపించడానికి సిద్ధంగా ఉంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.